తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు కోసం అందిన ఫారం-18 దరఖాస్తుల వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేసి, రాబోయే 15 రోజుల్లోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. గురువారం హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఓటరు జాబితా రూపకల్పన, నమోదు పురోగతిపై సమీక్షించారు.అర్హులైన గ్రాడ్యుయేట్ల పేర్లు ఓటరు జాబితాలో నమోదయ్యేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అలాగే అన్ని జిల్లాల్లో 'ఎలక్టోరల్ లిటరసీ క్లబ్‌ల' ద్వారా విద్యార్థులు, యువతకు ఓటు హక్కుపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులతో మాట్లాడుతూ, సీఈవో ఆదేశాల ప్రకారం జిల్లాలో ఫారం-18 దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి 15 రోజుల్లోగా వెరిఫికేషన్ పూర్తి చేయాలని, ఇందుకోసం అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఆర్డీవో మధు, ఎన్నికల సూపరింటెండెంట్ రంగప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ