తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రెడ్మండ్, వాషింగ్టన్ – రెడ్మండ్‌కు చెందిన యువ ప్రతిభావంతురాలు అవ్యుక్త గెల్లా, తన ప్రతిభ, అందం మరియు సేవా దృక్పథంతో "మిస్ టీన్ గ్లోబల్ ఏషియా 2025" (Miss Teen Global Asia 2025) కిరీటాన్ని గెలుచుకున్నారు. సరిగ్గా తన 15వ పుట్టినరోజు నాడే ఈ విజయం వరించడం అవ్యుక్త కు, ఆమె కుటుంబానికి రెట్టింపు ఆనందాన్ని ఇచ్చింది. ఈ పోటీని మెంకా సోని (Menka Soni) నేతృత్వంలోని "యాంపవరింగ్" (Ampowering - గతంలో Ravishing Women) సంస్థ నిర్వహించింది. సుమారు 14 ఏళ్లుగా సామాజిక సేవలో ఉన్న ఈ సంస్థ, పేదలకు ఆహారం, వస్త్రాలు అందించడంతో పాటు మహిళా సాధికారత కోసం విశేష కృషి చేస్తోంది. కేవలం అందం మాత్రమే కాకుండా, సమాజంలో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో యువతులను ప్రోత్సహించడంలో మెంకా సోని గారి కృషి ప్రశంసనీ లేక్ వాషింగ్టన్ హై స్కూల్ (Lake Washington High School) విద్యార్థిని అయిన అవ్యుక్త కు, ఈ కిరీటం కేవలం ఒక అందాల పోటీ విజయం మాత్రమే కాదు, తాను స్థాపించిన సేవా సంస్థ ద్వారా సమాజానికి మరింత సేవ చేయడానికి లభించిన ఒక వేదిక. అవ్యక్త ఇటీవల "ప్రవాహ ఫౌండేషన్" (Pravaah Foundation) అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. ఈ సందర్భంగా అవ్యుక్త మాట్లాడుతూ, "నా పుట్టినరోజు నాడు ఈ కిరీటాన్ని గెలుచుకోవడం నా జీవితంలో మర్చిపోలేని బహుమతి. అయితే, ఆకలి లేని సమాజం కోసం నేను చేస్తున్న పోరాటానికి ఈ గుర్తింపు మరింత బలాన్ని ఇస్తుంది," అని పేర్కొన్నారు. ప్రవాహ ఫౌండేషన్ (Pravaah Foundation) యొక్క ప్రధాన లక్ష్యం "నరిషింగ్ హోప్" (Nourishing Hope). నిరాశ్రయులకు, ఆకలితో అలమటించే వారికి పౌష్టికాహారాన్ని అందించడమే దీని ధ్యేయం. "ఎవరూ ఆకలితో ఉండకూడదు" అనే సంకల్పంతో అవ్యుక్త మరియు ఆమె యూత్ టీమ్ (Youth Board) నిరంతరం శ్రమిస్తున్నారు. సంస్థల వివరాలు: * యాంపవరింగ్ (Ampowering): మెంకా సోని స్థాపించిన ఈ సంస్థ, గత 13 ఏళ్లుగా "ఫీడ్ ది నీడ్" (Feed the Need) వంటి కార్యక్రమాల ద్వారా ఎంతో మందికి అండగా నిలుస్తోంది. మరిన్ని వివరాల కోసం: www.ampowering.org * ప్రవాహ ఫౌండేషన్ (Pravaah Foundation): 15 ఏళ్ల అవ్యుక్త గెల్లా స్థాపించిన ఈ సంస్థ, ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడానికి అంకితమైంది, వారి సేవలో భాగం కావడానికి లేదా విరాళాలు ఇవ్వడానికి చూడండి: www.pravaahfoundation.org మీరూ భాగస్వాములు కండి: ఈ రెండు సంస్థలు వాలంటీర్లను మరియు దాతలను ఆహ్వానిస్తున్నాయి. 'మిస్ టీన్ గ్లోబల్ ఏషియా'గా బాధ్యతలు చేపట్టిన అవ్యుక్త, ఆకలి లేని సమాజాన్ని నిర్మించడానికి అందరూ తనతో చేతులు కలపాలని కోరుతున్నారు. ఈ సందర్భగా, తాత (తాటిపల్లి శంకర్ బాబు గారు), అమ్మమ్మ (రాజేశ్వరి), తాతయ్య (గెల్లా నాగేశ్వరరావు గారు); నానమ్మ (స్వప్న) లు, అవ్యుక్త కు తమ శుభాకాంక్షలు మరియు దీవెనులు అందజేస్తున్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ