తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈ రోజు ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభమైన రెండవ విడుత పోలింగ్ నకు సంబంధించి పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితులను తెలుసుకుంటూ ఆయా పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ సరళిని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పరిశీలించారు.చుంచుపల్లి మండలం రుద్రంపూర్,గౌతమ్ పూర్,చుంచుపల్లి తండా,బాబు క్యాంప్,రామాంజనేయ కాలనీ,పాల్వంచ మండలం రంగాపురం,కేశవాపురం గ్రామాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను పరిశీలించి అక్కడ విధులు నిర్వర్తిస్తున్న అధికారులకు పలు సూచనలు చేశారు.రెండవ విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పటిష్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ అధికారులు,సిబ్బంది సమర్థవంతంగా తమ విధులను నిర్వర్తించడం జరుగుతుందని ఈ సందర్బంగా ఎస్పీ తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ