Wednesday, 04 November 2026 01:58:47 PM
# కండక్టర్ ప్రవళిక మృతి బాధాకరం: కుటుంబానికి కోటి రూపాయల బీమా, ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.మంత్రి పొన్నం ప్రభాకర్. # మహిళా కండక్టర్ ప్రవళిక మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి # తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TDPS) విడుదల చేసిన తాజా వాతావరణ నివేదిక ప్రకారం ముఖ్యాంశాలు # భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి.

అశ్వరావుపేట పట్టణాన్ని సుందరీకరిస్తాం - పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Date : 17 July 2025 10:41 AM Views : 881

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / అశ్వారావుపేట : దొంతికుంట చెరువుకు రింగ్ బండ్ – ప్రణాళికలు సిద్ధం చేయండి.. అశ్వరావుపేట మార్నింగ్ వాక్ లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అంతర్రాష్ట్ర సరిహద్దులో ఉన్న అశ్వరావుపేట పట్టణాన్ని అన్ని మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేసి, సుందరీకరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.గురువారం ఉదయం అశ్వరావుపేట రింగ్ రోడ్ నుండి దొంతికుంట చెరువు వరకు మంత్రి మార్నింగ్ వాక్ అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ, భద్రాచలం ఐటిడిఎ ప్రాజెక్ట్ ఆఫీసర్ రాహుల్ తో కలసి చేశారు . ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి ప్రజలను పలకరిస్తూ వారికున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఇటీవలగా మున్సిపాలిటీగా ఏర్పడిన అశ్వరావుపేట పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. దొంతికుంట చెరువు పరిసరాలలో ఎనిమిది మీటర్ల వెడల్పుతో రింగ్ బండ్ నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ ప్రాంతాన్ని ప్రజల కోసం విశ్రాంతి కేంద్రంగా అభివృద్ధి చేయాలని, వాకింగ్ ట్రాక్‌లు, పచ్చదనం కలిగిన పార్కులు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే పట్టణంలోని రహదారుల వెంట చెత్త వెంటనే తొలగించేలా మున్సిపల్ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచేందుకు మురుగునీరు శుద్ధి చేసే ప్లాంట్ ఏర్పాటు, డ్రైనేజీ లైన్ల నిర్మాణం, విద్యుదీకరణ వంటి పనులు విడతల వారీగా చేపడతామన్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో గిరిజన ప్రాంతమైన అశ్వరావుపేట నూతన మున్సిపాలిటీని మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు రహదారుల సుందరీకరణ, సెంట్రల్ లైటింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ పర్యటనలో మంత్రి వెంట వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :