తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మణుగూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని భగత్ సింగ్ నగర్ లో మణుగూరు సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఆదేశాల మేరకు మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు మణుగూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని భగత్ సింగ్ నగర్ లో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాం ను నిర్వహించడం జరిగింది.ఇందులో భాగంగా కాలనీలలోని ఇండ్లలో సోదాలు నిర్వహించడం జరిగింది.ఇట్టి సోదాలలో సరిగ్గా పత్రాలు లేని 04 ఆటోలు,44 బైకులను సీజ్ చేసి జరిమానాను విధించడం జరిగిందన్నారు.అదేవిధంగా గంజాయి వంటి ప్రభుత్వ నిషేధిత పదార్థాలను కనుగొనడానికి నార్కోటిక్ డాగ్స్ ద్వారా సోదాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు.అనంతరం అక్కడి స్థానికులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టవ్యతిరేక మరియు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని కోరారు. అట్టి వ్యక్తులపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని అన్నారు.రాబోయే ఎన్నికల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ సూచనలు మేరకు ఇలాంటి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని తెలిపారు.తమ ప్రాంతంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.మట్కా,జూదం,బెట్టింగ్,గంజాయి రవాణా వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయడమైనదని తెలిపారు.ఇట్టి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల సమాచారం తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలియజేసారు. కాలనీవాసులందరూ కలిసి తమ తమ ప్రదేశంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని నేరాలు నియంత్రణకు పోలీస్ వారికి సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సుమారుగా 80 మంది పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ