Monday, 03 August 2026 02:04:27 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

మెగా ఆధార్ క్యాంపుకు విశేష స్పందన .మండలాల వారీగా ఆధార్ క్యాంపులు

Date : 09 July 2025 07:36 PM Views : 4014

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన మెగా క్యాంపుకు ప్రజల నుండి విశేష స్పందన లభించింది అని జిల్లా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రెండు రోజులపాటు నిర్వహించు మెగా ఆధార్ క్యాంపును అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్ ప్రారంభించారు. ఆధార్ వివరాల నవీకరణ, చిన్నపిల్లల బయోమెట్రిక్ నమోదు, చిరునామా మార్పులు, మొబైల్ నెంబర్ అనుసంధానం వంటి సేవలు ఒకే చోట అందుబాటులో ఉండటంతో పెద్ద ఎత్తున ప్రజలు మెగా ఆధార్ క్యాంపుకు విచ్చేసి సేవలను సద్వినియోగం చేసుకున్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున మెగా ఆధార్ క్యాంపు కు ప్రజలు తరలివచ్చారని, వారికి అనుగుణంగా కావలసిన ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రస్థాయి బృంద సభ్యులు ఆదార్ సమస్యలపై తగిన పరిష్కారాలు చూపించారన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, వారి సౌకర్యార్థం ప్రతి మండల కేంద్రంలో ఆధార్ క్యాంపును నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. పెద్ద ఎత్తున ప్రజలు ఆధార్ నవీకరణ మరియు సవరణకు వస్తున్నందువలన ప్రతి మండలంలో షెడ్యూల్ వారిగా ఆధార్ క్యాంపులుప్రజలకు మరింత సౌకర్యంగా ఉండేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలో ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ తెలిపారు.జిల్లాలోని 23 మండలాల్లో వేర్వేరు తేదీల్లో ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నట్లు తెలిపారు. జూలై 10, 11 తేదీలలో : కొత్తగూడెం, పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, సుజాతనగర్, జులూరు పాడు, చండ్రుగొండ మండలాలకు కలెక్టర్ కార్యాలయంలోని నవభారత్ హాలులో ఆధార్ సేవలు అందించనున్నారు. జూలై 14, 15, 16 తేదీలలో : భద్రాచలం, బుర్గంపాడు, చర్ల, దుమ్ముగూడెం మండలాలకు భద్రాచలం ఆర్డీఓ కార్యాలయంలో,యెల్లందు, టెకులపల్లి, అల్లాపల్లి, గుండాల మండలాలకు యెల్లందు మున్సిపల్ కార్యాలయంలో క్యాంపులు జరుగుతాయి. జూలై 15, 16, 17 తేదీలలో : దమ్మపేట ఎంపీడీఓ కార్యాలయంలో దమ్మపేట, ములకలపల్లి, అన్నపురెడ్డిపల్లి మరియు ఆస్వారాపేట మండలాలకు,మణుగూరు ఎంపీడీఓ కార్యాలయంలో మణుగూరు, ఆస్వాపురం, పినపాక మరియు కారకగూడెం మండలాలకు క్యాంపులు నిర్వహించనున్నారు.ప్రతి కేంద్రంలో అవసరానికి తగిన విధంగా ఆధార్ కిట్లు అందుబాటులో ఉంచి వేగవంతంగా సేవలు అందించేలా అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లాలో ప్రజలు ఆధార్ సమస్యలను పరిష్కరించుకునే వరకు నిరంతరంగా ఆధార్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ రీజియన్ యు ఐ డి ఐ అసిస్టెంట్ మేనేజర్ మహమ్మద్ సౌభన్, జిల్లా ఈ డిస్టిక్ మేనేజర్ సైదేశ్వర రావు మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :