తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రామవరం ప్రాంతంలో ఉన్న కబరిస్తాన్ లో కరెంట్ పోళ్లకు పవర్ రాకపోవడంతో హిందూ మరియు క్రిస్టియన్స్ స్మశాన వాటికకు వెళ్లడానికి కూడా ఇబ్బందులు ఏర్పడుతున్నాయని కబ్రిస్తాన్ మరియు ఈద్గా అధ్యక్షులు ఫహీమ్ దాదా అన్నారు, అనంతరం ఆయన మాట్లాడుతూ హోల్స్ కి పవర్ రాకపోవడంతో లైట్లు వెలిగక అటుగా వెళ్లి హిందూ ముస్లిం మరియు క్రిస్టియన్స్ స్మశాన వాటిక లకు పార్థివ దేహాలను తీసుకొని వెళ్లేటప్పుడు చీకటితో యుద్ధం చేసుకుంటూ వెళ్లే పరిస్థితి ఉందని పాములు తేళ్లు విష కీటకాలు ఏ విధంగా దాడి చేస్తాయని భయభ్రాంతులకు గురి అయ్యే పరిస్థితి ఉందని దుఃఖ సముద్రంలో ఉన్న కుటుంబంలో పార్థివ దేహాన్ని ఈ పరిస్థితిలో దాహనం చేయాల్సి వస్తుందని మరింత కృంగి పోతున్నారని తక్షణమే పోల్స్ కి పవర్ అందించి సమస్య పరిష్కరించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు రసూల్ పాషా, శమీ ఉద్దీన్, ఖయ్యూం, జావిద్, అంకుష్, గౌస్, సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ