Wednesday, 16 September 2026 05:10:15 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

భద్రాద్రి ఆలయ మాస్టర్ ప్లాన్ పై దేవాదాయ శాఖ కమిషనర్ హరీష్ IAS గారితో సమీక్షించిన మంత్రి తుమ్మల

Date : 31 December 2025 06:11 PM Views : 378

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : • జూలై 23 2027 నుండి ప్రారంభం కానున్న పుష్కర ఏర్పాట్లపై సమీక్ష • భద్రాచలం రామాలయం మాడ వీధుల విస్తరణ ఆగమ శాస్త్రం ప్రకారం జరగాలి • దశల వారీగా మూడు ఏళ్ళలో విస్తరణ పనులు పూర్తి చేయాలి • సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన • కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాల ఏర్పాట్లు • దేవాదాయ శాఖ కమీషనర్ కు మంత్రి తుమ్మల దిశానిర్దేశం దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి రామయ్య ఆలయం నూతన శోభ సంతరించుకొనుంది. మార్చి 2026 లో శ్రీరామనవమి సీతారామ కళ్యాణం నేపథ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సమీక్షించారు. భద్రాద్రి రామయ్య అభివృద్ధి పనులకు ఆటంకంగా ఉన్న భూ సేకరణకు కాంగ్రెస్ సర్కారు ముఖ్యమంత్రి ఆదేశాలతో రూ. 34 కోట్లు విడుదల చేయడం తో భూ సేకరణ పూర్తి చేయడం జరిగింది. ఆలయం విస్తరణ పనులు కోసం భూ సేకరణ పూర్తవడంతో ఆలయం మాడ వీధుల విస్తరణ పనులు, ప్రాకార నిర్మాణాలు చేపట్టాలని,ఆగమ శాస్త్రం ప్రకారం ఆర్కిటెక్ట్ ఇచ్చిన డిజైన్లు (మాస్టర్ ప్లాన్) ముఖ్య మంత్రి ఆమోదం తో ఫైనల్ చేసి పనులు మొదలు పెట్టాలని మంత్రి తుమ్మల సూచించారు. దీంతో దక్షిణ అయోధ్య టెంపుల్ సిటీకి అడుగులు పడనున్నాయి. భద్రాచలం రామాలయం మాడ వీధుల విస్తరణ పనులు ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మాణం చేయాలని మంత్రి తుమ్మల తెలిపారు. బుధవారం నాడు హైదరాబాద్ సచివాలయం లో దేవాదాయ శాఖ కమీషనర్ హరీష్ తో ఆలయ విస్తరణ పనులు పై మంత్రి తుమ్మల చర్చించారు.ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ దక్షిణ అయోధ్య గా భాసిల్లుతున్న భద్రాచలం రామాలయం 1664 లో భక్త రామదాసు నిర్మాణం చేశారు. పెరుగుతున్న భక్తుల సౌకర్యం కోసం ఆలయం విస్తరణ పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. రామాలయం మాడ వీధుల విస్తరణ పనులు దశల వారీగా మూడు ఏళ్ళలో పూర్తి చేయాలని దేవాదాయ శాఖ కమీషనర్ హరీష్ కు మంత్రి తుమ్మల దిశా నిర్దేశం చేశారు. మంత్రి తుమ్మల చొరవతో సీఎం రేవంత్ రెడ్డి భూసేకరణకు కావలసిన నిధులను విడుదల చేసి ఆలయ అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. భారతదేశానికి తలమానికంగా దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. అనేక ఏళ్లుగా పెండింగ్లో ఉన్న భూసేకరణ సమస్యకు ఎట్టకేలకు మంత్రి తుమ్మల పరిష్కారం చూపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో నవ భద్రాద్రి దిశగా తుమ్మల కృషి చేస్తున్నారు. భూ సేకరణ తరువాయి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. దక్షిణ అయోధ్యగా భద్రాద్రి ఆలయ కీర్తి ధ్వనించేలా అభివృద్ధి చేయనున్నారు. నమూనాలు సిద్ధం... శ్రీరామచంద్రుడి ఆలయ అభివృద్ధికి శరవేగంగా అడుగులు పడుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యవేక్షణలో భద్రాద్రి ఆలయం నూతన శోభ సంతరించుకొనుంది. ఆగమ పండితులు రూపొందించిన నమూనాల ప్రకారం అభివృద్ధి పనులను ప్రారంభించేలా మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు. మాస్టర్ ప్లాన్ నమూనాల ప్రకారం అత్యద్భుతంగా భద్రాద్రి ఆలయ పునర్నిర్మాణానికి అడుగులు పడనున్నాయి. గోదావరి పుష్కరాలు కుంభ మేళా మాదిరి ఏర్పాట్లు: వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్ల పై దేవాదాయ శాఖ కమీషనర్ తో చర్చించారు. పుష్కర ఏర్పాట్లపై అన్నీ శాఖలతో సన్నాహక సమావేశం నిర్వహించాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. కుంభమేళా తరహాలో భద్రాచలం లో పుష్కరాల ఏర్పాట్లు చేయాలని మంత్రి తుమ్మల సూచించారు. దక్షిణ అయోధ్య గా భాసిల్లుతున్న భద్రాచలం రామాలయం దర్శనానికి మరియు గోదావరి నదిలో పుష్కర స్నానానికి లక్షలాది మంది భక్తులు వస్తారని ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్నానాల ఘాట్లు ఏర్పాటు చేయాలని వసతి కేంద్రాలు, మెడికల్ క్యాంప్ లు శానిటేషన్, తాగునీరు, రవాణా సౌకర్యాలు భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయాలన్నారు. శానిటేషన్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని అన్ని ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుని పుష్కరాల ఏర్పాట్లు చేయాలని మంత్రి తుమ్మల దిశా నిర్దేశం చేశారు. 2003 లో 2015 లో గోదావరి పుష్కరాలు సమయంలో మంత్రిగా ఉన్న తుమ్మల అప్పటి అనుభవాలను గుర్తు చేసారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాల సందర్భంగా చేపట్టాల్సిన ముందస్తు ప్రణాళికలు పై ఎండోమెంట్ కమీషనర్ కు మంత్రి తుమ్మల తన అనుభవాలు వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరగనున్న గోదావరి పుష్కరాల నిర్వహణ ప్రభుత్వ ప్రతిష్ట పెంచేలా ఉండాలని కోట్లాది మంది భక్తులు మెచ్చేలా పుష్కరాల ఏర్పాట్లు చేయాలని ఎండోమెంట్ కమీషనర్ హరీష్ కు మంత్రి తుమ్మల ప్రభుత్వ విధానం వివరించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :