Wednesday, 16 September 2026 04:16:12 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

పంట విస్తీర్ణానికి అనుగుణంగా యూరియా బుకింగ్ చేసుకోవాలి: జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 05 July 2026 06:44 PM Views : 186

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : యూరియా బుకింగ్ యాప్‌లో సవరించిన మార్గదర్శకాలు నేటి నుంచి అమలు – రైతులు దశలవారీ బుకింగ్ విధానాన్ని అనుసరించాలి.రాష్ట్ర ప్రభుత్వం రైతులకు యూరియా ఎరువుల సరఫరాను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు యూరియా బుకింగ్ యాప్లో పలు మార్పులు చేసినట్లు జిల్లా కలెక్టర్ అంకిత్ ఒక ప్రకటనలో తెలిపారు. సవరించిన ఈ మార్గదర్శకాలు నేటి నుంచి జరిగే అన్ని యూరియా బుకింగ్‌లకు అమల్లోకి వస్తాయని చెప్పారు.యూరియా బుకింగ్‌ను పంట విస్తీర్ణానికి అనుగుణంగా దశలవారీ విధానంలో నిర్వహించేలా ప్రభుత్వం నిర్ణయించిందని కలెక్టర్ తెలిపారు. రెండు ఎకరాల వరకు సాగు చేసే రైతులు తమ పంటకు అవసరమైన మొత్తం యూరియాను ఒకేసారి బుక్ చేసుకుని పొందవచ్చని అన్నారు . రెండు ఎకరాలకు పైగా ఐదు ఎకరాల వరకు సాగు చేసే రైతులు పంట అవసరానికి అనుగుణంగా యూరియాను రెండు విడతలుగా బుక్ చేసుకోవాలని సూచించారు. ఐదు ఎకరాలకు పైగా సాగు చేసే రైతులకు యూరియా మూడు విడతలుగా 40 శాతం, 30 శాతం, 30 శాతం నిష్పత్తిలో బుకింగ్ అయ్యే విధంగా యాప్‌లో మార్పులు చేసినట్లు తెలిపారు.రెండు యూరియా బుకింగ్‌ల మధ్య కనీసం 20 రోజుల వ్యవధి తప్పనిసరిగా ఉండేలా నిబంధన అమలు చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. రైతులు ఎలాంటి అపోహలకు లోనుకాకుండా ప్రభుత్వం రూపొందించిన సవరించిన మార్గదర్శకాల ప్రకారం యూరియా బుకింగ్ చేసుకోవాలని, అవసరానికి మించి యూరియాను బుక్ చేసేందుకు ప్రయత్నించవద్దని సూచించారు. జిల్లాలో యూరియా ఎరువుల లభ్యతకు ఎలాంటి ఇబ్బంది లేదని, రైతులందరికీ అవసరమైన మేరకు ఎరువులు అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. ఏవైనా సందేహాలు ఉంటే సమీప వ్యవసాయ విస్తరణ అధికారి లేదా వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని, రైతులందరూ యూరియా బుకింగ్ యాప్‌లో అమలులోకి వచ్చిన సవరించిన విధానాన్ని తప్పనిసరిగా అనుసరించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ కోరారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :