Thursday, 14 May 2026 02:20:55 AM
# అశ్వారావుపేటకు హార్టికల్చర్ కళాశాల తీసుకొచ్చిన ఎమ్మెల్యే జారె. # అన్నపురెడ్డిపల్లి చెరువు వద్ద పేకాట శిబిరంపై పోలీసుల దాడిలో నలుగురు అరెస్ట్. # బి ఆర్ ఎస్ కమిటి ఆధ్వర్యంలో ఆందోళన చేసిన మండల ఉపాధ్యక్షులు మద్దిరాల చిన్న పిచ్చయ్య. # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే జారె. # సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పించిన టేకులపల్లి ఎస్సై జుబేదా బేగం. # కలెక్టర్ చేతుల మీదుగా బ్యాటరీ వీల్ చైర్ పంపిణీ. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # జిల్లాలో లాడ్జిలను నడిపించే యాజమాన్యాలు నిబంధనలను కచ్చితంగా పాటించాలి. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # ఎన్సీసీ క్యాడెట్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన ట్రాఫిక్ పోలీసులు. # కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం వల్ల అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుతుంది. ఎమ్మెల్యే జారె. # అశ్వారావుపేట నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే జారె. # జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన బాంబు డిస్పోజల్ బృందం సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పర్సనల్ మేనేజర్ తిరుపతి నీ సన్మానించిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం. # పుల్లాయిగూడెం శ్రీసీతారామాంజనేయస్వామి ఆలయ పూజలో పాల్గొన్న టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు . # రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం గుండుగులపల్లి కార్యక్రమంలో వివరించిన ఎమ్మెల్యే జారె. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్. # విపత్తుల నిర్వహణ మాక్ ఎక్సర్సైజ్‌లకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ఆసుపత్రులు,డయాగ్నస్టిక్ సెంటర్లకు అనుమతులు తప్పనిసరి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : జిల్లా కలెక్టర్ అంకిత్. # తమిళనాడు గవర్నర్ వ్యవహారం హాస్యాస్పదం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలి : సాధారణ పరిశీలకులు సర్వేశ్వర రెడ్డి.

Date : 04 December 2025 07:43 PM Views : 197

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఖచ్చితంగా అమలు చేయాలని సాధారణ పరిశీలకులు వి. సర్వేశ్వర రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఐడిఓసి కార్యాలయం నుండి తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఏ ఓ లు, ఏ ఈ ఓ లు,పోలీస్ శాఖ అధికారులు, ఎన్నికల సంబంధిత విభాగాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో ఎన్నికల వ్యయ పరిశీలకులు పి. లావణ్య, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన , జెడ్పీసీఈఓ నాగలక్ష్మి పాల్గొన్నారు.ఈ సందర్భంగా సాధారణ పరిశీలకులు సర్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, శాంతియుత వాతావరణంలో సాగేందుకు కఠిన చర్యలు తప్పనిసరిగా చేపట్టాలని స్పష్టం చేశారు. గ్రామాలు, మండలాల వారీగా ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న పరిస్థితులను అధికారులు ఎలా పర్యవేక్షిస్తున్నారో వివరాలు తెలుసుకున్నారు. ఎఫ్‌ఎస్‌టిఎస్, ఎస్‌ఎస్‌టి, వి‌ఎస్‌టి, వి వి టి బృందాలు నిరంతర పర్యవేక్షణ చేయాలని, ఎన్నికలతో సంబంధం ఉన్న చట్టవిరుద్ధ చర్యలను తక్షణమే అరికట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా మద్యం, నగదు, బహుమతుల పంపిణీ వంటి ప్రలోభాలను అడ్డుకోవాలని స్పష్టం చేశారు. ఏ రకమైన అక్రమాలు చోటుచేసుకుంటే కఠినంగా వ్యవహరించాల్సిందిగా అన్ని విభాగాల అధికారులకు సూచించారు. ఏకగ్రీవం అయిన స్థానాలలో ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు సంబరాలు జరగకుండా చర్యలు చేపట్టాలని, ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యేంతవరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉంటుందని అభ్యర్థులకు అవగాహన కల్పించాలని అన్నారు.ఎన్నికల ప్రక్రియలో ప్రతి దశను వీడియో రికార్డింగ్ చేయాలని అధికారులకు సూచించిన పరిశీలకులు, బృందాలు గ్రామాలు, చెక్‌పోస్టులు, సున్నిత ప్రాంతాలను క్షేత్రస్థాయిలో సందర్శించి నిరంతర పర్యవేక్షణ చేయాలని అన్నారు.ఎన్నికలు స్వచ్ఛంగా, నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా జరుగేలా ఏ చిన్న లోపానికీ తావివ్వకుండా చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.ఈ సమీక్షా సమావేశంలో హాజరైన అధికారులను తాము విధుల్లో నిర్లక్ష్యం చూపకూడదని , ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా ఎన్నికల నిర్వహణలో నిబద్ధతతో పనిచేయాలని సాధారణ పరిశీలకులు సర్వేశ్వర రెడ్డి సూచించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :