Thursday, 17 September 2026 11:52:30 AM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

మునగ సాగుపై అవగాహన సదస్సు. మునగ సాగు రైతుల పాలిట ఒక వరం : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 08 November 2024 06:56 PM Views : 562

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మునగసాగు పై అధికారులకు మరియు రైతులకు ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో ఇల్లందు, టేకులపల్లి,ఆళ్లపల్లి, గుండాల మరియు లక్ష్మి దేవి పల్లి ఎంపీడీవోలు, ఏపీవోలు, ఎంఏవోలు, ఏ ఈ ఓ లు, టి ఏ లు, ఈసీలు, ఎఫ్ఏ లు మరియు రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ మునగ సాగు రైతులకు ఒక వరం అని అన్నారు. మనం మన పొలంలో పని చేసుకుంటూ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీ రూపంలో మరియు మెటీరియల్ రూపంలో మనకే డబ్బులు వచ్చే అద్భుతమైన అవకాశం మునగ సాగు ద్వారా ఉందని ఆయన తెలిపారు.ఒక ఎకరానికి 1000 మొక్కలు నాటితే ప్రతి మొక్కకు కనీసం 150 కాయలు కాసినచో 1000 మొక్కలకు 1,50,000 కాయలు వస్తాయి. ఇట్టి కాయలను రూపాయికి రెండు చొప్పున ( కేజీ ₹5 ) అమ్మినా 75 వేల రూపాయలు ఆదాయం వస్తుందని, అంతేకాకుండా ఎండబెట్టిన ఆకుల పొడి ద్వారా మరియు ఎండిన గింజల ద్వారా వచ్చు నూనె వలన అధిక ఆదాయం రైతుల కు లభిస్తుందన్నారు. అధికారులు రైతులకు మునగ సాగు పై అవగాహన కల్పించాలని, ప్రతి వంద మంది రైతుల్లో కనీసం ఐదుగురు మునగ సాగు చేపట్టేగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి రైతు కనీసం ఒక్క ఎకరం లో మునగ సాగు చేపట్టేలా అవగాహన కల్పించాలన్నారు.ఈ వారంలో మునగ శాఖకు రైతులు సన్నద్ధం కావాలని, లేకపోతే ఈ సీజన్ లో అవకాశం కోల్పోతామని అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులు మరియు రైతులు మునగ సాగు చేయడం లో వచ్చే సమస్యలను అడిగి తెలుసుకుని, వారి సందేహాలను నివృత్తి చేశారు.ఈ సందర్భంగా రైతులు మునగ సాగు పంట లాభదాయకమని కానీ వాటి మార్కెటింగ్ చేయుటకు తగు ప్రోత్సాహాన్ని కల్పించాలని, మునగ సాగులో కలుపు తీయుటకు సరైన యంత్రాలు కల్పించాలని, మునగ ఆకు పొడి చేయుటకు ఉపయోగించు యంత్రాలపై అవగాహన కల్పించాలని,పోడు భూముల్లో మునగ సాగు చేపట్టే రైతులకు బోర్ వేసుకునేలా అటవీశాఖ అధికారుల నుంచి అనుమతులు వచ్చేలా తగు చర్యలు చేపట్టాలని కలెక్టర్ కు విన్నవించారు. దీనికి కలెక్టర్ ఆరుగాలం కష్టపడి సాగు చేసిన రైతు కు సరైన మార్కెటింగ్ అవకాశాలను కల్పిస్తామని, పోడు భూముల్లో సాగు చేసే రైతులకు బోర్ అనుమతుల కోసం అటవీ శాఖ అధికారులతో మాట్లాడుతామన్నారు. మునగ సాగు లో జిల్లాలోని రైతులందరూ ఆదర్శ రైతులుగా ఉండే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని, రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తామన్నారు. ఇప్పుడు మనం ధైర్యం చూపించే సమయం వచ్చిందని, మునగ సాగుపై అవగాహన పెంచుకొని, మహాత్మా గాంధీ ఎన్ఆర్ఈజీఎస్ మరియు ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకొని రైతుల స్వతంత్రులుగా అభివృద్ధి చెందాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, జిల్లా ఉద్యాన శాఖ అధికారి కిషోర్ మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :