తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : బోనాల పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీక. ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలి.ప్రకృతిని ఆరాధించే విశిష్ట పండుగ బోనాలు.భక్తిభావం, ఐక్యతను పెంపొందించే వేడుక.కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక అని, ప్రజలంతా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆకాంక్షించారు. లక్ష్మీదేవిపల్లి పరిధిలోని సింగరేణి బంగ్లోస్ గేటు సమీపంలో వెలసిన శ్రీ పోచమ్మ తల్లి దేవాలయంలో ఆదివారం శ్రావణమాస బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు శ్రావణ బోనాల శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడే గొప్ప సంప్రదాయం మన పండుగల్లో దాగి ఉందని పేర్కొన్నారు. గ్రామాలు, పట్టణాలు సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు బాగుండాలని కోరుతూ భక్తిశ్రద్ధలతో ప్రజలు అమ్మవార్లను కొలవడం మన ఆచారమన్నారు. ఇలాంటి ఉత్సవాలు సమాజంలో సోదరభావం, ఐక్యతను పెంపొందిస్తాయని ఆయన వివరించారు. పోచమ్మ తల్లి చల్లని దీవెనలతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలు, శాంతిసౌభాగ్యాలతో ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, కొత్తగూడెం మున్సిపల్ మేయర్ మూడ్ గణేష్, ఆలయ ధర్మకర్త రాజ్య తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ