Thursday, 14 May 2026 01:03:28 AM
# అశ్వారావుపేటకు హార్టికల్చర్ కళాశాల తీసుకొచ్చిన ఎమ్మెల్యే జారె. # అన్నపురెడ్డిపల్లి చెరువు వద్ద పేకాట శిబిరంపై పోలీసుల దాడిలో నలుగురు అరెస్ట్. # బి ఆర్ ఎస్ కమిటి ఆధ్వర్యంలో ఆందోళన చేసిన మండల ఉపాధ్యక్షులు మద్దిరాల చిన్న పిచ్చయ్య. # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే జారె. # సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పించిన టేకులపల్లి ఎస్సై జుబేదా బేగం. # కలెక్టర్ చేతుల మీదుగా బ్యాటరీ వీల్ చైర్ పంపిణీ. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # జిల్లాలో లాడ్జిలను నడిపించే యాజమాన్యాలు నిబంధనలను కచ్చితంగా పాటించాలి. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # ఎన్సీసీ క్యాడెట్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన ట్రాఫిక్ పోలీసులు. # కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం వల్ల అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుతుంది. ఎమ్మెల్యే జారె. # అశ్వారావుపేట నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే జారె. # జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన బాంబు డిస్పోజల్ బృందం సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పర్సనల్ మేనేజర్ తిరుపతి నీ సన్మానించిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం. # పుల్లాయిగూడెం శ్రీసీతారామాంజనేయస్వామి ఆలయ పూజలో పాల్గొన్న టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు . # రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం గుండుగులపల్లి కార్యక్రమంలో వివరించిన ఎమ్మెల్యే జారె. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్. # విపత్తుల నిర్వహణ మాక్ ఎక్సర్సైజ్‌లకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ఆసుపత్రులు,డయాగ్నస్టిక్ సెంటర్లకు అనుమతులు తప్పనిసరి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : జిల్లా కలెక్టర్ అంకిత్. # తమిళనాడు గవర్నర్ వ్యవహారం హాస్యాస్పదం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు.

ఐ.డి.ఓ.సి మీటింగ్ హాల్ నందు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు

Date : 08 December 2025 07:08 PM Views : 127

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు ఐ.డి.ఓ.సి మీటింగ్ హాల్ నందు జిల్లా సంక్షేమ అధికారిణి స్వర్ణలత లెనినా అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన అడిషనల్ కలెక్టర్ విద్యా చందన, జడ్.పి. సి.ఇ.ఓ. నాగలక్ష్మి, మెప్మ పీడీ రాజేష్ జ్యోతి, దివ్యాంగ సంఘాల అధ్యక్షులు ప్రజ్వలన చేసి ఈ వేడుకలను ప్రారంభించారు. అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అర్హులైన దివ్యాంగులు యు.డి.ఐ.డి. కార్డులు పొందాలని, వివరాలను తెలియచేశారు. క్రితంలో పొందిన యు.డి.ఐ.డి. కార్డుల సవరణలు పోర్టల్ ద్వారా చేసుకోవచ్చని, జిల్లాలో దివ్యాంగుల డ్వాక్రా సంఘాలుగా తయారయి, పొదుపు చేసి రుణాలు పొందవచ్చని, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ఇన్సూరెన్స్ పథకాలను పొందాలని, దివ్యాంగులు ఎలాంటి సమస్యలు ఉన్న తమను సంప్రదిస్తే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లి సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తామని తెలిపారు. జెడ్. పి. సి.ఈ.ఓ. (జిల్లా విద్యా శాఖ ఇంచార్జీ) మాట్లాడుతూ ప్రతి మండలంలో భవిత సెంటర్లు ఏర్పాటు చేశామనీ, ప్రత్యేక అవసరత కలిగిన పిల్లలకు ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ అందిస్తున్నామని, వారిలో నైపుణ్యాన్ని వెలికి తీస్తున్నామని, భవిత సెంటర్లను అన్ని సౌకర్యాలతో తీర్చిదిద్దామని ఈ సౌకర్యాలు ప్రత్యేక అవసరత ఉన్న పిల్లలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. వీరి కోసం ఐ.ఈ.డి. కోఆర్డినేటర్స్ మండలాల వారిగా పనిచేస్తున్నారని తెలిపారు. జిల్లా సంక్షేమ అధికారిణి మాట్లాడుతూ జిల్లాలోని దివ్యాంగులకు తమ శాఖ ద్వారా అందిస్తున్న సంక్షేమ పథకాలు అయినటువంటి వివాహ ప్రోత్సాహక బహుమతి-దివ్యాంగులను సకలంగులు లేదా దివ్యాంగులను దివ్యాంగులు వివాహం చేసుకున్న వారికి లక్ష రూపాయలు ప్రోత్సాహక బహుమతికి అర్హులని, టీజీ ఈపాస్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని, ప్రీమెట్రిక్, పోస్టుమాటిక్స్ స్కాలర్షిప్లు కొరకు ఒకటి నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు స్కాలర్షిప్లు మంజూరు చేస్తామని, టీజీ ఈపాస్ ద్వారా మరియు పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్ల కొరకు దరఖాస్తు చేయాలని, స్వయం ఉపాధి పథకం ద్వారా సబ్సిడీ రుణాలు మంజూరు చేస్తున్నామని వాటిని టీజీ ఓబి ఎంఎంఎస్ నందు వెబ్సైట్ నందు నోటిఫికేషన్ వెలువడినప్పుడే ఆన్లై ఆన్లైన్ లో దరఖాస్తు చేయాలని, సహాయ ఉపకరణాల కొరకు కూడా టీజీ ఓబి ఎంఎంఎస్ వెబ్సైట్ నందు నోటిఫికేషన్ వెలువడినప్పుడే దరఖాస్తు చేయాలని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలలో ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నామని తెలిపారు. వికాసం ప్రత్యేక పాఠశాల బధిర విద్యార్థులు వేసిన నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలలో ఆటల పోటీలలో గెలుపొందిన విద్యార్థులు విద్యార్థులకు మెడల్స్, సర్టిఫికెట్లు ప్రధానం చేయడం జరిగింది. వివిధ రంగాలలో దివ్యాంగుల కొరకు సేవలు అందిస్తున్న వారికి, అసోసియేషన్ సభ్యులకు, ఎం.ఈ.జి.ఆర్.ఎస్., సెర్ప్ సిబ్బందిని, ప్రభుత్వ శాఖలలో వివిధ హోదాలలో పనిచేస్తున్న సిబ్బందిని మొత్తం 120 మందిని మెమెంటో, శాల్వాలతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సెర్ప్ సిబ్బంది, ఐ.ఈ.డి. కోఆర్డినేటర్ సైదులు, బ్లైండ్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేందర్, బదిరుల సంఘం జిల్లా అధ్యక్షుడు రామలింగారెడ్డి, తెలంగాణ విభిన్న ప్రతిభావంతుల సంఘం అధ్యక్షులు సతీష్, మదర్ తెరిసా దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు కృష్ణ, విహెచ్పిఎస్ సంఘం అధ్యక్షుడు సుధాకర్, అక్షయ దివ్యాంగుల సంఘం అధ్యక్షురాలు షమీం, ఎన్ పి ఆర్ డి సంఘం అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్, ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు జగ్గుదాస్, బి.లక్ష్మణ్, ఎం.డి ముజాహిద్, జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయ సిబ్బంది మరియు దివ్యాంగులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :