Saturday, 19 September 2026 01:32:31 PM
# హమారా ప్రసాద్ ను UAPA చట్టం కింద శాశ్వతంగా జైల్లోనే ఉంచాలి. మద్దెల శివకుమార్. # ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు.

రామ భక్తునికి తావు లేదా! హనుమాన్ విగ్రహ తరలింపుపై తొలగని ప్రతిష్టంభన.

Date : 02 April 2026 05:16 PM Views : 371

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రామ భక్తునికి తావు లేదా! హనుమాన్ విగ్రహ తరలింపుపై తొలగని ప్రతిష్టంభన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం పరిధిలోని VK-7 ఇంక్లైన్ ప్రాంతంలో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి విగ్రహం తొలగింపు, పునఃప్రతిష్ఠ అంశంపై ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది. సింగరేణి సంస్థ ఆవిర్భావం నుంచే ఈ ఆలయానికి ప్రత్యేక అనుబంధం ఉందని భక్తులు పేర్కొంటున్నారు. ఈ ప్రాంతంలో కాలనీలు అభివృద్ధి చెందిన సమయంలో, స్వామివారు భక్తులకు ధైర్యం, రక్షణ, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచారని వారి విశ్వాసం. ఓపెన్ కాస్ట్ గనుల విస్తరణతో కాలనీలు, కార్మికులను ఇతర ప్రాంతాలకు తరలించినప్పటికీ, దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు స్వామివారి దర్శనానికి వస్తూనే ఉన్నారు. ప్రస్తుతం గనుల అవసరాల దృష్ట్యా గుట్టపై చెక్కబడిన రాతి విగ్రహాన్ని వేరే ప్రదేశానికి తరలించడం అనివార్యమైంది. అయితే, పునఃప్రతిష్ఠ కోసం సరైన స్థలం ఎంపికలో ఆలస్యం జరుగుతుండటంతో భక్తుల్లో అసంతృప్తి నెలకొంది. అభివృద్ధికి వ్యతిరేకం కాదు – భక్తులు సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల ద్వారా ఖనిజ సంపదను వెలికితీసి దేశ అభివృద్ధికి తోడ్పడటంతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రశంసనీయం అని భక్తులు అభిప్రాయపడుతున్నారు. సంస్థ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు తమకు ఎటువంటి వ్యతిరేకత లేదని స్పష్టం చేస్తున్నారు. అయితే, భక్తుల భావోద్వేగాలను గౌరవిస్తూ విగ్రహ తరలింపు ప్రక్రియను చేపట్టాలని, పునఃప్రతిష్ఠకు అనుకూలమైన స్థలం కేటాయించాలని ప్రధానంగా కోరుతున్నారు. జనావాసాలకు సమీపంలోనే స్థలం కావాలి విగ్రహ తరలింపుకు సింగరేణి యాజమాన్యం సహకరించేందుకు ముందుకు రావడం పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ జనావాసాలకు దూరంగా కాకుండా అందుబాటులో ఉండే ప్రదేశాన్ని కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. VK-4 ఇంక్లైన్ కోల్ టెస్టింగ్ ల్యాబ్ సమీపంలో ఉన్న స్థలం అనుకూలమని భావిస్తూ, అదే ప్రదేశాన్ని కేటాయించాలని భక్తులు కోరుతున్నారు. భక్తులకు అనుకూలంగా లేని ప్రదేశంలో ఆలయం ఏర్పాటు చేస్తే ప్రయోజనం ఉండదని, అందరికీ సులభంగా చేరుకునే ప్రదేశంలో ఆలయం ఉంటేనే అభివృద్ధి సాధ్యమని వారు పేర్కొంటున్నారు. అధికారుల అభిమతం ఏమిటో? సింగరేణి అధికారులు భక్తులతో పలుమార్లు చర్చలు జరిపినప్పటికీ, కోరిన స్థలంపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఆలయ కమిటీ సభ్యులు మాత్రం మొదటి నుంచే తమ అభీష్ట ప్రదేశాన్ని కేటాయిస్తే ఆలయానికి పునర్వైభవం తీసుకురాగలమని చెబుతున్నారు. భక్తులు తమ డిమాండ్‌ను తెలియజేస్తూ విజ్ఞాపన పత్రం సమర్పించాలని నిర్ణయించారు. భద్రాద్రి శ్రీరామయ్య సన్నిధిలో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామికి అనుకూలమైన స్థలం కేటాయించలేకపోవడం ఆశ్చర్యకరమని వారు వ్యాఖ్యానిస్తున్నారు. హిందూ బంధువులందరూ ఏకమై, శాస్త్రోక్తంగా విగ్రహ పునఃప్రతిష్ఠ చేసి ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. వివిధ సంఘాలు కూడా ఈ కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ ముందుకు రావడం గమనార్హం. తీర్మానం కోసం ఎదురుచూపులు శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన శ్రీ అభయాంజనేయ స్వామి వారి విగ్రహ తరలింపు అంశం ప్రస్తుతం సింగరేణి అధికారుల నిర్ణయంపై ఆధారపడి ఉంది. ఈ సమస్యకు వారు ఎలాంటి పరిష్కారం చూపిస్తారో చూడాలి.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :