Thursday, 17 September 2026 08:19:16 AM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో హాజరు శాతం పెంచాలి : జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 16 June 2026 04:42 PM Views : 144

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కుంగిపోయిన కల్వర్టుకు తక్షణమే మరమ్మత్తులు చేపట్టాలి – జిల్లా కలెక్టర్ అంకిత్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడంతో పాటు విద్యా ప్రమాణాల మెరుగుదలకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. మంగళవారం ఆళ్ళపల్లి మండలంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ అంకిత్, ఆళ్ళపల్లి మండల ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో మొత్తం విద్యార్థుల సంఖ్య, హాజరు శాతం వివరాలను ప్రధానోపాధ్యాయుడిని అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ఆవరణలో నిర్వహిస్తున్న ప్రీ-ప్రైమరీ విభాగం, అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించి, చిన్నారులకు అందిస్తున్న బోధన విధానం, విద్యా కార్యకలాపాలపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు తల్లిదండ్రులతో నిరంతరం సంప్రదింపులు జరపాలని, ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న సౌకర్యాలు, నాణ్యమైన విద్యపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రంలో పిల్లలకు అందించేందుకు సిద్ధంగా ఉంచిన భోజనం, పాలు, బాలామృతం తదితర పోషకాహార పదార్థాలను పరిశీలించారు. కేంద్రంలో కేవలం ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండటాన్ని గమనించిన కలెక్టర్, హాజరు శాతాన్ని పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పెద్ద వెంకటాపురం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను పరిశీలించిన కలెక్టర్, విద్యార్థుల హాజరు వివరాలను అడిగి తెలుసుకున్నారు.గొత్తికోయలు నివసించే ఈ మారుమూల గిరిజన ప్రాంతంలో బడిఈడు పిల్లలందరూ తప్పనిసరిగా పాఠశాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. పాఠశాల ఆవరణలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్, పిల్లల సంఖ్య, వారికి అందిస్తున్న సేవలు, పోషకాహార సరఫరా వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలో తక్కువ మంది పిల్లలు ఉన్నప్పటికీ అధిక మొత్తంలో నిల్వలు ఉండటాన్ని గమనించి, అవసరానికి మించి ఉన్న సరుకులను సమీప అంగన్‌వాడీ కేంద్రాలకు తరలించాలని సూచించారు. అలాగే కేంద్రాల్లో పిల్లల చేరికలు పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పరిశీలన సందర్భంగా పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉన్న సమస్యలపై అధికారులను అడిగి తెలుసుకున్న కలెక్టర్, అంగన్‌వాడీ కేంద్ర భవనానికి పెయింటింగ్ వేయించి పరిశుభ్రంగా నిర్వహించాలని సూచించారు. విద్యార్థులకు మెరుగైన విద్యా, పోషకాహార సేవలు అందేలా అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. ఈ పర్యటనలో భాగంగా ఆళ్ళపల్లి నుండి పెద్ద వెంకటాపురం గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న కల్వర్టు కుంగిపోయి ఉండటాన్ని జిల్లా కలెక్టర్ అంకిత్ గమనించారు. వెంటనే వాహనం దిగి కల్వర్టును పరిశీలించిన కలెక్టర్, వర్షాకాలంలో వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా అత్యవసరంగా మరమ్మత్తు పనులు చేపట్టాలని ఆర్ అండ్ బీ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పనులను త్వరితగతిన పూర్తి చేసి రాకపోకలు సాఫీగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట కొత్తగూడెం ఆర్డీవో మధు, ఆళ్లపల్లి తాసిల్దారు ఉషారాణి, ఎంఈఓ శాంతారావు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :