తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గుండాల మండలంలో వినాయక నిమజ్జనం వేళ విషాదం చోటుచేసుకుంది. గురుకులంలో ఏర్పాటు చేసిన వినాయకుడి నిమజ్జనం జరుగుతుండగా, వంట సిబ్బందిగా పని చేస్తున్న బానోత్ మోహన్(38) ప్రమాదవశాత్తు వాగులో పడి మృతి చెందాడు. 3 రోజులుగా ఎంతో ఉత్సాహంగా, సంతోషంగా పండుగలో పాల్గొన్న మోహన్ అకస్మాత్తుగా మరణించడంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ