Friday, 18 September 2026 07:13:11 PM
# ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు.

కార్మికురాలి మరణానికి కారణమైన మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలి : బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్

Date : 10 August 2024 08:22 PM Views : 653

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మున్సిపాలిటీలోని 8వ వార్డులో పని చేస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య కాంట్రాక్ట్ కార్మికురాలు బత్తుల ఓదెమ్మ మరణానికి మున్సిపల్ అధికారులే కారణమని వారిపై చర్యలు తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ యెర్రా కామేష్,సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీ కన్వీనర్ జలాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శనివారం అఖిలపక్షం ఆధ్వర్యంలో మరణించిన బాధితురాలి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలనే డిమాండ్ తో ఆసుపత్రి శవ పరీక్ష విభాగం (పోస్ట్ మార్టం రూమ్) ముందు బైఠాయించి నిరసన చేపట్టారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఘటన జరిగిన వెంటనే మున్సిపల్ అధికారులు సరిగా స్పందించలేదని వైద్యం అందించడంలో నిర్లక్ష్యం జరిగిందని ఆరోపించారు.ప్రాణాంతక మందు తాగినప్పుడు 24 గంటలైనా అత్యవసర విభాగంలో వెంటిలేటర్ పై ఉంచాలని కానీ ప్రభుత్వ ఆసుపత్రిలో వెంటిలేటర్ సౌకర్యం లేకపోయినా మెరుగైన వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు తరలించకుండా అక్కడే అత్యవసర విభాగం నుండి జనరల్ వార్డుకు తరలించి అక్కడ వైద్యం చేయడం వల్లనే ఈ ఘటన జరిగిందని పేర్కొన్నారు.ఇప్పటికే మున్సిపాలిటీలో ఇది రెండో ఘటన అని అయినప్పటికీ మున్సిపల్ అధికారుల పనితీరులో ఏ మాత్రం మార్పు రావడంలేదని కార్మికులకు రక్షణ సౌకర్యాలు వారి భద్రత పర్యవేక్షణలో అనేక లోపాలు ఉన్నాయని వారు విమర్శించారు.ఇలాంటి ఘటనలు మరలా పునరావృతం కాకుండా ప్రభుత్వం,జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.మృతురాలి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం,ఎక్స్గ్రేషియా ప్రకటించి వారి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకోవాలని డిమాండ్ చేశారు.కార్మికుల రక్షణ,భద్రత పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మున్సిపాలిటీ కమిషనర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో బహుజన కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు సాయి,మృతురాలి కుమార్తెలు సరోజ,నాగలక్ష్మీ,ఉషా,కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :