తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సంఘటిత పోరాటంతోనే సమస్యల పరిష్కారం.ఆటో కార్మికుల సంక్షేమానికి నిరంతర పోరాటం.ఇంధన ధరల నియంత్రణ, సామాజిక భద్రత కల్పించాలి.యూనియన్‌లో చేరిన 150 మంది ఆటో డ్రైవర్లు.రాష్ట్ర అధ్యక్షులు, కొత్తగూడెం పట్టణ సిపిఐ పార్టీ కార్యదర్శి కంచర్ల జమలయ్య.సంఘటిత పోరాటంతోనే ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆటో వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు, కొత్తగూడెం పట్టణ సిపిఐ పార్టీ కార్యదర్శి కంచర్ల జమలయ్య అన్నారు. శేషగిరి భవన్ లో గురువారం ఏఐటియూసి అనుబంధ ఆటో వర్కర్స్ యూనియన్ 15వ పట్టణ మహాసభ యూనియన్ అధ్యక్షులు అబ్బులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ మహాసభకు వివిధ అడ్డాల నుంచి పెద్ద సంఖ్యలో ఆటో డ్రైవర్లు, కార్మికులు హాజరై సభను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో కార్మికుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, ఉపాధి భద్రత కోసం ఏఐటియూసి నిరంతరం పోరాడుతుందని తెలిపారు. ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారం కోసం ఉద్యమిస్తామని హామీ ఇచ్చారు. పెరుగుతున్న ఇంధన ధరలు, జీవన వ్యయానికి అనుగుణంగా ఆటో కార్మికుల సంక్షేమ పథకాల అమలు, సామాజిక భద్రత, ప్రమాద బీమా, పెన్షన్ వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. మహాసభలో యూనియన్ బలోపేతం, సభ్యత్వ నమోదు విస్తరణ, కార్మికుల హక్కుల పరిరక్షణకు చేపట్టాల్సిన కార్యాచరణపై పలు తీర్మానాలను ఆమోదించినట్లు పేర్కొన్నారు.ఐటీయూసీలో భారీ చేరికలు : కాగా, ఈ మహాసభలో వివిధ ఆటో అడ్డాల నుంచి 150 మంది ఆటో డ్రైవర్లు యూనియన్‌లో చేరగా, కంచర్ల జమలయ్య వారికి పార్టీ కండువా కప్పి సంఘంలోకి సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నూతనంగా యూనియన్‌లో చేరిన ఆటో వర్కర్లు మాట్లాడుతూ, తమ సమస్యల పరిష్కారం కోసం ఏఐటియూసి ఆధ్వర్యంలో ఐక్యంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఫయామ్, మర్రి కృష్ణ, ఆరెళ్ళి కృష్ణ, అబ్బులు, విజ్జి, బాబు జానీ దేశి, బోట్టు శ్రీను, మంద శ్రీసు, జలీల్, గౌస్, చింటు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ