తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఘనంగా దేశ తొలిమహిళా ఉపాధ్యాయరాలు సావిత్రిబాయి పూలే వర్ధంతి వేడకలు.ఐ.ఎల్.పీ.ఏ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు భానుప్రియ. దేశ తొలిమహిళా ఉపాధ్యాయురాలు,సంఘ సంస్కర్త మాతా సావిత్రిబాయి ఫూలే అని ఐ.ఎల్.పీ.ఏ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు,న్యాయవాది సుంకర భానుప్రియ అన్నారు.మంగళవారం సావిత్రిబాయి ఫూలే వర్ధంతిని పురస్కరించుకొని కొత్తగూడెం న్యాయవాదుల లైబ్రరీ హాల్ నందు ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం ఆమె మాట్లాడుతూ కుల,మత భేదాలకు అతీతంగా ఆధునిక విద్య ద్వారానే స్ర్రీ విముక్తి సాధ్యమవుతుందని నమ్మిన సావిత్రిబాయి పూలే భర్తతో కలిసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించిందన్నారు.కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పీడిత ప్రజలు ముఖ్యంగా మహిళల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం ఉద్యమకారిణి అని కొనియాడారు.సావిత్రిబాయి పూలే లక్ష్యలు,ఆశయాల్ని అచరించాలనుకునే ప్రతి ఒక్కరూ ఆమె జీవితాన్ని అధ్యయనం చేయాలని,దేశానికి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయిని సావిత్రిబాయి పూలేనని చాటి చెప్పాలన్నారు.నేటి యువతి, యువకులు ఆమె ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఈకార్యక్రమంలో బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, యెర్రా కామేష్, మల్లెల ఉష రాణి, అడపాల పార్వతీ, నీలవేణి, గోపీకృష్ణ, ఎర్రపాటి కృష్ణ, మారపాక రమేష్, నాగస్రవంతి, శ్వేత, స్వప్న, సంధ్యారాణి, పద్మకల, బేబీ షామిలి, హర్షిత తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ