Thursday, 17 September 2026 06:09:11 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

నిరంతర విద్యుత్ అందించాలి.. టెలి కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 19 February 2025 07:50 PM Views : 751

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అధికారులందరూ ప్రజలకు అందుబాటులో ఉంటూ అంతరాయం లేకుండా విద్యుత్ నిరంతరంగా సరఫరా అయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లాలోని విద్యుత్, త్రాగునీరు, సాగునీరు, రేషన్ కార్డ్ దరఖాస్తుల పరిశీలన మరియు రైతు భరోసా దరఖాస్తుల నమోదు ప్రక్రియ ల పై అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ విద్యా చందన, జడ్పీ సీఈఓ నాగలక్ష్మి,, సంబంధిత జిల్లా అధికారులు, తాసిల్దారులు, ఎంపీడీవోలు, ఎంపీ ఓలు, ఎం ఏ ఓ లు, ఎంసీఎస్లు, డిఇలు మరియు మిషన్ భగీరథ మరియు విద్యుత్ శాఖ ఏఈలతో టెలికాన్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ.. ప్రజల గృహ మరియు వాణిజ్య అవసరాలకు అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి విద్యుత్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆటో జనరేటర్లు అందుబాటులో కు తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రైతు భరోసా దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియలో భాగంగా పార్షియల్ సబ్ డివిజన్ మార్కింగ్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చినందున తాసిల్దారులు మరియు మండల వ్యవసాయ అధికారులు తమ పరిధిలోని వ్యవసాయానికి యోగ్యం కానీ భూముల మార్కింగ్ ప్రక్రియను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో యూరియా ఎంత అందుబాటులో ఉంది ఎంత అవసరం పడుతుందో తగిన నివేదికల సమర్పించాలని, రైతులకు తగినంత ఎరువులు అందుబాటులో డేల చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని సాగు అవసరాలకు నీరు అందేలా ఇరిగేషన్, మండల వ్యవసాయ అధికారులు మరియు తాసిల్దార్లు సమన్వయంతో పర్యవేక్షించి చివరి రైతులకు కూడా సాగునీరు అందేలా చూడాలి అన్నారు. జిల్లాలో రైతు భరోసా ఫిర్యాదులపై సమగ్ర నివేదికలు మండల మరియు జిల్లాస్థాయిలో అందించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో త్రాగునీటి అవసరాలకు సరిపడా నీరు ఉందని కలెక్టర్ అన్నారు. త్రాగునీటి సరఫరా లో వచ్చే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడం ద్వారా వేసవిలో తాగునీటి సమస్యలు రాకుండా చూడాలని అన్నారు. మున్సిపల్ కమిషనర్లు మరియు పంచాయతీ సెక్రటరీలు ఏ వార్డులో ఏ పంచాయితీలో త్రాగునీటి సరఫరాకు సమస్యలు ఉన్నాయో గుర్తించి వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. త్రాగునీటి ట్యాంకులను ప్రతినెల రెండు సార్లు శుభ్రం చేసి బ్లీచింగ్ చల్లాలని ఆదేశించారు. ఎంపీడీవోలు ఎంపీలు తమ పరిధిలోని పాత మోటర్లు బాగు చేసి వాటిని అదనంగా అందుబాటులో ఉంచుకోవాలని, ప్రతి గ్రామంలో 10 శాతం మోటర్లు ఘనంగా అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. చేతిపంపులు ఎక్కడైతే రిపేరు ఉన్నాయో గుర్తించి వాటిని రిపేర్లను వెంటనే పూర్తి చేయాలని అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున కొత్త రేషన్ కార్డ్ ల పంపిణీ ఎన్నికల అనంతరం చేపడతామని కలెక్టర్ అన్నారు. మీ సేవలో కొత్త రేషన్ కార్డుల కొరకు వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిశీలన పూర్తి చెయ్యాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో సోలార్ పవర్ ప్లాంట్ ల స్థాపన కొరకు స్థల గుర్తింపును త్వరితగతిన పూర్తి చేయాలని కొత్తగూడెం మరియు భద్రాచలం ఆర్డీవో లను ఆదేశించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :