Wednesday, 04 November 2026 04:32:13 AM
# సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు.

పిల్లల సామర్థ్యాల పెంపుదలలో ప్రధానోపాధ్యాయులు ప్రధాన పాత్ర పోషించాలి

Date : 14 October 2025 06:41 PM Views : 363

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పిల్లల సామర్థ్యాల పెంపుదల లో ప్రధాన ఉపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులు, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. కొత్తగూడెంలోని జిల్లా విద్యా శిక్షణ కేంద్రంలో ప్రధానోపాధ్యాయుల సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ పాఠశాల మౌలిక వసతుల అభివృద్ధి తన బాధ్యత అని, పిల్లల సామర్థ్యాల పెంపుదల కోసం కృషి చేసేటట్లుగా ఉపాధ్యాయులను ఉత్తేజ పరచడం ప్రధానోపాధ్యాయుల బాధ్యత అని, దీనిని విస్మరిస్తే విద్యార్థుల ప్రగతి అగమ్య గోచరం అవుతుందని అన్నారు. పాఠశాలలో మౌలిక వసతుల సమాచారం యు డేస్ లో వాస్తవ స్థితి ప్రతిబింబించేటట్లుగా నమోదు చేయాలని సూచించారు. అదేవిధంగా ఉపాధ్యాయులు తమ బోధన సామర్ధ్యాలు మెరుగుపరచుకునేటట్లుగా నిరంతరం ఉపాధ్యాయుల ప్రోత్సహిస్తూ ఉన్నతమైన ఫలితాలు తీసుకురావడానికి కృషి చేయాలని అన్నారు. మౌలిక భాష మరియు గణిత అభివృద్ధి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి పాఠశాల పర్యవేక్షణ బలోపేతం చేసుకుంటూ ఉపాధ్యాయులకు మంచి సూచనలు సలహాలు ఇస్తూ వారిని ప్రోత్సహించి పిల్లల సామర్థ్యాలు మెరుగుపడేటట్లుగా కృషి చేయాలని అన్నారు. అదేవిధంగా పాఠశాలలో వినూత్న కార్యక్రమాలు చేపట్టి పాఠశాల అభివృద్ధికి ఆటంకాలు లేకుండా ఉండాలంటే తల్లిదండ్రుల సమావేశాలు ప్రముఖ పాత్ర వహిస్తాయని, ఈ సమావేశాలను సమర్థవంతంగా నిర్వహించి పాఠశాల అభివృద్ధిలో భాగస్వామ్యులై వారు పనిచేసే పాఠశాలలో, ఆ గ్రామంలో మంచి గుర్తింపు పొందడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయని జిల్లా కలెక్టర్ ఉద్భోదించారు. రాబోయే పదవ తరగతి పరీక్షలలో 100% ఫలితాలు సాధించడానికి ఇప్పటి నుండే ప్రణాళికల రూపొందించుకోవాలని, దీనికోసం గ్రామాల్లోని స్వయం సహాయక బృందాల సహకారంతో పిల్లలకు వివిధ పాఠ్యాంశాలలో సందేహాన్నివృత్తికై ట్యూషన్లు ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తామని కలెక్టర్ తెలిపారు. అంతకుముందు జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీమతి బి. నాగలక్ష్మి మాట్లాడుతూ తరగతి గదిలో ఉన్న ప్రతి విద్యార్థి వివరాలు యూడైస్ లో, ముఖ గుర్తింపు హాజరులో, తప్పనిసరిగా ఉండేటట్లుగా చూడాలని, నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని పిల్లలకి అందించేటట్లుగా ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఏ. నాగరాజశేఖర్, సమ్మిళిత విద్యా కోఆర్డినేటర్ ఎస్కే. సైదులు, ప్లానింగ్ కోఆర్డినేటర్ ఎన్. సతీష్ కుమార్, ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ ఎస్. మాధవరావు, జిల్లా ఉమ్మడి పరీక్షల విభాగ కార్యదర్శి బి. నీరజ, జిల్లా ఫైనాన్స్ అధికారి ఏ. జగన్, సి.ఎస్.ఎఫ్ బృంద నాయకుడు నందకిషోర్, అన్ని మండలాల మండల విద్యాశాఖ అధికారులు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :