Thursday, 17 September 2026 07:49:04 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

ఇల్లందు మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.50 కోట్లు. రాష్ట్ర రెవెన్యూ గృహనిర్మాణ సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.

Date : 22 April 2026 07:15 PM Views : 270

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఇల్లందు మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.50 కోట్లు.ప్రజల శ్రేయస్సే లక్ష్యం – ప్రజాప్రతినిధులు సేవాభావంతో పనిచేయాలి. వేసవిలో తాగునీటి సమస్యలు లేకుండా చర్యలు.. ఇల్లందు పర్యటనలో రాష్ట్ర రెవెన్యూ గృహనిర్మాణ సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలో రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య, జిల్లా కలెక్టర్ అంకిత్, ఐటిడిఏ పీవో రాహుల్ తదితరులు పాల్గొన్నారు.పర్యటనలో భాగంగా మంత్రి ఇల్లందు 10వ వార్డులో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తడికమల్ల భాగ్యమ్మ, కోడిమల్ల లక్ష్మి గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొని, పూజలు నిర్వహించి లబ్ధిదారులతో కలిసి గృహాలను ప్రారంభించారు. అనంతరం ఇల్లందు మున్సిపల్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన చైర్‌పర్సన్ గది ప్రారంభించి, చైర్‌పర్సన్ కిరణ్ మిత్రకు శుభాకాంక్షలు తెలిపారు. ఆపై మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఇల్లందు పట్టణ అభివృద్ధికి ప్రత్యేక మున్సిపల్ సమావేశం ఏర్పాటు చేసి సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చుతామని అన్నారు . ఇల్లందు అభివృద్ధికి రూ.50 కోట్లు మంజూరు చేస్తామని ఇచ్చిన మాట ప్రకారం, త్వరలో రెండు విడతల్లో నిధులు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.ప్రజల శ్రేయస్సే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రాజకీయాలకు అతీతంగా అందరికీ సమానంగా అభివృద్ధి ఫలాలు అందేలా కృషి చేయాలని సూచించారు. వేసవి కాలంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్, కౌన్సిలర్లు ప్రతిరోజూ సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలతో నిత్యం సంబంధం పెంచుకుంటూ ఉదయం, సాయంత్రం సమయం కేటాయిస్తే మంచి ఫలితాలు సాధ్యమవుతాయని తెలిపారు.ప్రజా ప్రభుత్వం నిరంతరం ప్రజల కోసం పని చేస్తుందని, ప్రతి ప్రజాప్రతినిధి బాధ్యతగా ప్రజలకు సేవ చేయాలని మంత్రి కోరారు. కొత్తగా ఎన్నికైన సభ్యులు అనుభవం లేదని భావించకుండా అధికారులతో సమన్వయం చేసుకొని సమస్యలను పరిష్కరించాలని సూచించారు.ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య మాట్లాడుతూ , మంత్రి నాయకత్వంలో నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలో 200 నుంచి 700 ఓట్ల మెజారిటీతో గెలుపొందారున్నారు. కొత్తగా వార్డు కౌన్సిలర్లు ప్రతి వార్డులో సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ , ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని 24 వార్డుల్లో పారిశుద్ధ్యం, లైటింగ్, తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. వేసవిలో నీటి సమస్యలు లేకుండా ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నామని, వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేస్తూ సమస్యలను తక్షణమే పరిష్కరిస్తున్నామని వివరించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, కొత్తగూడెం ఆర్డీవో మధు, గృహ నిర్మాణ శాఖ ఫీడింగ్ రవీందర్ నాథ్, తాసిల్దార్ ఎంపీడీవో ధన్సింగ్,మున్సిపల్ వైస్ చైర్మన్ రాజు, మున్సిపల్ కమిషనర్ సంబంధిత శాఖల అధికారులు ప్రజా ప్రతినిధులు లబ్ధిదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :