Sunday, 02 August 2026 02:50:59 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

ధరల పెరుగుదలపై రాజీలేని పోరాటం చేద్దాం.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా.

Date : 05 June 2026 07:09 PM Views : 164

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ధరల పెరుగుదలపై రాజీలేని పోరాటం చేద్దాం.వంటగ్యాస్, నిత్యావసరాల ధరలు తగ్గించేవరకు ఉద్యమాలు తప్పవు. పెట్రోల్, డీజిల్ భారాన్ని మోపడం దుర్మార్గం. ప్రజా వ్యతిరేక విధానాలపై గళమెత్తుదాం. జూన్ 10 కలెక్టరేట్ ధర్నాను జయం చేయండి. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక తీరును ఎండగడదాం.పార్టీ పటిష్టతకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలి.ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాలే శరణ్యం.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలపై రాజీలేని పోరాటం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా పిలుపునిచ్చారు. చుంచుపల్లి మండల విస్తృత కౌన్సిల్ సమావేశం శుక్రవారం బాబు క్యాంపు కార్యాలయం 'రజబ్ అలీ భవన్'లో జరిగింది. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. నిత్యావసరాల ధరల భారంతో సామాన్య ప్రజలు బ్రతికే పరిస్థితి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై జూన్ 10న జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగే ధర్నాను భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. పార్టీ విస్తరణకు, స్థానిక ప్రజా సమస్యల పరిష్కారానికి నాయకులు, కార్యకర్తలు నిరంతరం కృషి చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సలిగంటి శ్రీనివాస్, వాసిరెడ్డి మురళి, జి వీరాస్వామి, జిల్లా సమితి సభ్యులు వంగ వెంకట్, పొలమూరి శ్రీనివాస్, రాంచందర్, నాయకులు తోట రాజు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :