Friday, 18 September 2026 07:14:06 PM
# ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు.

పనిస్థలాల్లో ఉపాధి హామీ కార్మికులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలి - జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 21 May 2026 03:06 PM Views : 123

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఉపాధి హామీ పనులకు హాజరయ్యే కార్మికుల సంఖ్యను పెంచాలి.. లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రపురం గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద కొనసాగుతున్న ఏం ఐ ట్యాంక్ పనులను జిల్లా కలెక్టర్ అంకిత్ గురువారం పరిశీలించారు. గ్రామ శివారులో కొనసాగుతున్న ఉపాధి హామీ పనుల వద్దకు వెళ్లిన కలెక్టర్ అక్కడ పనిచేస్తున్న కార్మికులతో మాట్లాడి వారికి వేతనాలు సకాలంలో అందుతున్నాయా, పనుల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయా అనే అంశాలను అడిగి తెలుసుకున్నారు. కార్మికులకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు పూర్తి స్థాయిలో అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు. ప్రస్తుతం ఎండ తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో పనిస్థలాల్లో కార్మికులకు తాగునీరు, నీడ కోసం టెంట్లు, ప్రథమ చికిత్స పెట్టెలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పని సమయంలో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, కార్మికుల ఆరోగ్య రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఆక్టివ్ జాబ్ కార్డుల వివరాలను కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో మొత్తం 300 జాబ్ కార్డులు ఉండగా ప్రస్తుతం 146 మంది మాత్రమే పనులకు హాజరవుతున్నారని అధికారులు వివరించారు. దీనిపై స్పందించిన కలెక్టర్, ఉపాధి హామీ పనులపై గ్రామస్థులకు మరింత అవగాహన కల్పించి అర్హులైన ప్రతి కుటుంబం నుంచి ఎక్కువ మంది పనులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉపాధి హామీ పనులకు హాజరయ్యే కార్మికుల సంఖ్యను పెంచి గ్రామీణ కుటుంబాలకు ఉపాధి అవకాశాలు మరింత విస్తరించేలా చూడాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మాస్టర్ కార్డు లు పరిశీలించి ఒక కుటుంబం నుంచి ఎంతమంది పనులకు వస్తున్నారు, పని దినాలు సక్రమంగా నమోదవుతున్నాయా అనే అంశాలపై అధికారులను ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. పనుల నిర్వహణలో పారదర్శకత పాటించాలని, ప్రతి కార్మికుడి హాజరు వివరాలు ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. ఉపాధి హామీ నిధులతో చేపడుతున్న పనులు గ్రామాభివృద్ధికి ఉపయోగపడేలా ఉండాలని, నీటి వనరుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షణ నిర్వహిస్తూ పనులను సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట సర్పంచ్ కంగాల అంజలి డిఆర్డిఓ విద్యాచందన, తాసిల్దార్ శిరీష, పంచాయతీ సెక్రటరీ సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :