తెలుగు వెలుగు టీవీ - వార్తలు / పాల్వంచ : 78వ స్వాత్రంత్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన స్వాత్రంత్య దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు.నెహ్రు నగర్ లో మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో జెండా ఆవిష్కరించి కామేష్ మాట్లాడుతూ ఎందరో త్యాగదనుల పోరాట ఫలితంగా ప్రతీ ఒక్కరికీ సమాన అవకాశాలు,స్వేచ్ఛ సమానత్వం ఈగడ్డ పై ఉంటుందని అదే భారత రాజ్యాంగ గొప్పతనమన్నారు.బహుజనులు పాలకులు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అప్పుడే వారి జీవితాల్లో మార్పులు వస్తాయన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంధం మల్లికార్జున రావు,కోళ్ళపూడి ప్రవీణ్ కుమార్,కాల్వ ప్రసాద్,రవి,రమేష్,విజయ్ తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ