తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గురువారం నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాఐ డి ఓ సి మినీ సమావేశ మందిరంలో వివిధ బ్యాంకులకు చెందిన అధికారులతో, జిల్లాస్థాయి అధికారులతోసమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రాధాన్యతా రంగాలను పరిగణలోకి తీసుకొని రుణాలు మంజూరు చేయాలని, వ్యవసాయ రంగ అభివృద్ధికి రుణాలు ఎంతో ముఖ్యమని చెప్పారు. రుణాల మంజూరు తో రైతులు ఆధునిక వ్యవసాయ పరికరాలు కొనుగోలు, వినియోగంతో అధిక ఉత్పత్తిని సాధించడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. అంతర్జాల సేవలు అందుబాటు లేని కారణంగా ప్రజలు పౌర సేవలతోపాటు మారుమూల గ్రామాలలో బ్యాంకింగ్ సేవలు పొందడానికి ఆటంకం కలుగుతుందని బిఎస్ఎన్ఎల్, జియో, ఎయిర్టెల్ సంస్థల అధికారులతో సమావేశం నిర్వహించుటకు కార్యచరణ తయారు చేయాలని తెలిపారు. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకంలో బ్యాంకులు ఖాతాలు ప్రారంభించడానికి అన్ని బ్యాంకులకు లక్ష్యాలు కేటాయించాలని ఎల్ డి ఎం కు సూచించారు.ఐ టి డి ఏ ద్వారా పెండింగ్ లో ఉన్న యూనిట్లపై మంజూరుకు చర్యలు చేపట్టడంతో పాటు నివేదికలు అందజేయాలని చెప్పారు. మత్స్యకారులకు రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లను ఆదేశించారు. మండల స్థాయి వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించి రుణాలు మంజూరు చేయించాలన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండలం చండ్రుగొండ మండలం బెండలపాడు గ్రామంలో గిరిజన రైతులు బ్యాంకు రుణం ద్వారా మూడు కోట్ల వ్యయంతో కోల్డ్ స్టోరేజ్ స్థాపించుకున్నారని, దానిని మార్గదర్శకంగా తీసుకుని జిల్లాలోని రైతులు బ్యాంకు రుణాల సహాయంతో మరిన్ని కోల్డ్ స్టోరేజ్ లు నిర్మించుకోవాలని సూచించారు. జిల్లాలోని 23 రైతు వేదికలలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైదరాబాదు నుండి ప్రతి మంగళవారం వ్యవసాయ అధికారులు మరియు శాస్త్రవేత్తలు రైతులకు సలహాలు సూచనలు ఇస్తున్నారని,ఆ సందర్భంలోఅన్ని బ్యాంకులు రుణమేళాలు, రెన్యువల్సు నిర్వహించాలని,రైతులకు నూతన వ్యవసాయ విధానాలపై అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రైతులు వ్యవసాయానికి ఈ ఆధునిక కాలంలో కూడా ఎద్దులను వాడుతున్నారని, వాటి ఖరీదులో మినీ ట్రాక్టర్స్, వాడుకునే విధంగా రైతులకు అవగాహన కల్పించి రుణాలు మంజూరు చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, పశుసంవర్ధక శాఖ అధికారి పురందరేశ్వర్, ఎస్సీఈడీ కార్పొరేషన్ సంజీవరావు, ఆర్బిఐ నుంచి పృద్వి, చీఫ్ మేనేజర్ లోన్స్ శ్రీ నివాస్, ఏపీ ఏపీజీవీబీ ఆర్ ఎం, ఎం ఉదయ్, ఐటీడీఏ ఎస్ ఓ వివిఎన్ భాస్కరరావు, అన్ని బ్యాంకుల కంట్రోలర్లు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ