Thursday, 17 September 2026 09:32:40 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

Date : 14 September 2024 05:03 PM Views : 1294

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈ రోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ గారు జిల్లా సైబర్ క్రైమ్స్ కో-ఆర్డినేషన్ సెంటర్ ను ప్రారంభించారు.చుంచుపల్లి పోలీస్ స్టేషన్ పైన నూతనంగా ఏర్పాటు చేసిన ఈ సైబర్ క్రైమ్స్ కో-ఆర్డినేషన్ సెంటర్ ద్వారా జిల్లా వ్యాప్తంగా సైబర్ నేరాల బారిన పడిన వారికి అండగా ఉంటూ,బాధితులు కోల్పోయిన నగదును తిరిగి వారు పొందే విధంగా సహాయం చేయడంలో తోడ్పడుతుందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ తెలిపారు.సైబర్ నేరాల బారిన పడిన వారికి సహాయ సహకారాలు అందించేందుకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో ఒక్కొక్కరు చొప్పున 28 మంది సైబర్ వారియర్స్ ను కూడా కేటాయించడం జరిగిందని తెలియజేశారు.సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఎత్తులతో అమాయక ప్రజల డబ్బును వారి అకౌంట్ల నుండి కాజేస్తున్నారని అన్నారు.

సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఎత్తులతో అమాయక ప్రజల డబ్బును వారి అకౌంట్ల నుండి కాజేస్తున్నారని అన్నారు.జిల్లా వ్యాప్తంగా సైబర్ క్రైమ్స్ పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తూ అన్ని పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల పరిష్కారానికి ఈ సైబర్ క్రైమ్స్ కో ఆర్డినేషన్ సెంటర్ కృషి చేస్తుందని తెలిపారు.కావున జిల్లా ప్రజలు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా అప్రమత్తంగా ఉండేందుకు జిల్లా పోలీస్ శాఖ తరపున అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నిరంతరం అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేసారు.సైబర్ నేరాల బారిన పడి నగదు కోల్పోయిన వారు వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1930 కి కాల్ చేసి ఫిర్యాదు చేస్తే సైబర్ నేరగాళ్ల బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేసి బాధితులు తిరిగి తమ నగదును పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.సైబర్ నేరానికి గురైనట్లు ఎంత త్వరగా గ్రహించి ఫిర్యాదు చేయగలిగితే (గోల్డెన్ అవర్లో) అంత త్వరగా కోల్పోయిన నగదును కాపాడుకోవచ్చని తెలిపారు.

ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా సైబర్ నేరాల బారిన పడిన బాధితుల నుండి అందుకున్న ఫిర్యాదుల మేరకు 265 కేసులను నమోదు చేయడమైనది. రూ.2,61,62,175/-(రెండు కోట్ల అరవై ఒక్క లక్షల అరవై రెండువేల నూట డెబ్భై ఐదు) రూపాయలను సైబర్ నేరగాళ్ళ అకౌంట్ల నుండి తిరిగి బాధితులకు అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ గారితో పాటు పాల్గొన్న అధికారులు చుంచుపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ పరితోష్ పంకజ్ ఐపిఎస్,కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్,స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్లు నాగరాజు,శ్రీనివాస్,చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు,సైబర్ క్రైమ్స్ ఇన్స్పెక్టర్ జితేందర్,1టౌన్ సీఐ కరుణాకర్, 2టౌన్ సీఐ రమేష్ మరియు కొత్తగూడెం సబ్ డివిజన్ పరిధిలోని ఇతర పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :