తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా కేంద్ర గ్రంథాలయం భద్రాద్రి కొత్తగూడెం నందు మహిళా దినోత్సవ సందర్భంగా గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు గ్రంథాలయ కార్యదర్శి కే .కరణ కుమారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కొల్లు ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు కల్పనా చౌదరి పాల్గొని అన్నారు. మహిళలు నేడు అనేక రంగాలలో ముందంజలో ఉన్నారని ఇంకా మహిళలు అన్ని విధాల అన్ని రంగాలలోఉన్నత స్థానంలో ఉండాలని అప్పుడే సమాజాభివృద్ధి కుటుంబా అభివృద్ధి జరుగుతుందని వివరించారు ఈ సందర్భంగా కేక్ కటింగ్ చేసి మహిళా ఉద్యోగులను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమాల్లో గ్రంథాలయ కార్యదర్శి కే కరణకుమారి ఆఫీస్ ఇన్చార్జి ఎం నవీన్ కుమార్ గ్రంథా పాలకురాలు జీ.మణిమృదుల గ్రంథ పాలకులు వాణి, రుక్మిణి, గీత, విద్యార్థినీ విద్యార్థులు పాఠకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ