తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు మండల పరిధిలోని ఏ వి ఆర్ ఫంక్షన్ హాల్ నందు జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం జరిగింది. జనసేన పార్టీ మండల అధ్యక్షుడు ఉసికల రమేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మున్సిపాలిటీ ఎన్నికలలో జనసేన పార్టీ ఎన్నికల బరిలో నిలిచింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో జనసేన పార్టీ బీఫామ్ తో 22 స్థానాలలో పోటీలో ఉండగా వారి గెలుపు కొరకు మున్సిపాలిటీలో బరిలో జనసేన అభ్యర్థులకు అండగా జూలూరుపాడు మండలం నుండి జనసైనికులు, వీర మహిళలు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభిమానులు భారీగా తరలి వెళ్లనున్నామని తెలిపారు. మండల అధ్యక్షుడు తో పాటు జనసేన పార్టీ మండల నాయకులు తాటికొండ చలపతిరావు, చలమల విజయ్ జనసైనికులు పర్స నాగరాజు, పురేటి ఉదయ్ కిరణ్, సారంగి మల్లికార్జున్, గణప సాయి, ధర్మరాజుల బన్నీ, యాస రాకేష్, రేగుముడి పుల్లారావు, నిమ్మటూరి తరుణ్, మద్దిబోయిన యల్లేశ్వరావు, చేతుల సాయి కిరణ్ లు పార్టీ కార్యకర్తలు,జన సైనికులు హాజరయ్యారు.
Admin
తెలుగు వెలుగు టీవీ