Wednesday, 16 September 2026 08:25:29 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

ఏకలవ్య పాఠశాలలో విద్యాబోధనకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలి : కలెక్టర్ అంకిత్.

Date : 09 September 2026 05:06 PM Views : 378

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తరగతి సమయాల్లో ఇతర కార్యక్రమాలు నిర్వహించొద్దు.ప్రయోగాత్మక విద్యపై విద్యార్థుల్లో ఆసక్తి పెంచాలి. పరిశుభ్రత, ఆహార నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. టేకులపల్లి మండలంలోని తెలంగాణ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను జిల్లా కలెక్టర్ అంకిత్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యాబోధన, విద్యార్థుల హాజరు, తరగతుల నిర్వహణ, ప్రయోగశాలలు, భోజనం, పరిశుభ్రత, యూనిఫాంలు, వెల్నెస్ సెంటర్ తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, విద్యార్థులతో నేరుగా మాట్లాడారు. 8, 9, 10వ తరగతుల గదులను పరిశీలించిన కలెక్టర్ కొన్ని తరగతుల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడంపై ఆరా తీశారు. గ్రామసభ, విద్యార్థి పార్లమెంట్, స్కాలర్‌షిప్‌కు సంబంధించిన బ్యాంకు ఖాతాల ప్రారంభం వంటి కార్యక్రమాల కోసం విద్యార్థులు తరగతులకు దూరంగా ఉన్నట్లు అధికారులు వివరించారు. ఆర్ట్ అండ్ డ్రాయింగ్ తరగతిని పరిశీలించి బోధిస్తున్న అంశాలను తెలుసుకున్నారు. 8వ తరగతి లైబ్రరీ పీరియడ్‌కు బదులుగా స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తరగతి సమయాన్ని పూర్తిగా విద్యాబోధనకే కేటాయించాలని, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇతర కార్యక్రమాల్లో నిమగ్నం కాకుండా చూడాలని స్పష్టం చేశారు. గ్రామసభ, విద్యార్థి పార్లమెంట్, బ్యాంకు ఖాతాల ప్రారంభం, స్కౌట్స్ అండ్ గైడ్స్ వంటి కార్యక్రమాలను తరగతుల అనంతరం లేదా శనివారాల్లో నిర్వహించాలని ఆదేశించారు. విద్యా క్యాలెండర్ ప్రకారం ప్రతి పీరియడ్‌ను సక్రమంగా నిర్వహించి విద్యార్థుల చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని సూచించారు.భౌతిక శాస్త్ర ప్రయోగశాలను పరిశీలించిన కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడి ప్రయోగాలపై వారి అవగాహనను తెలుసుకున్నారు. పాఠ్యాంశాలను కేవలం పుస్తకాలకు పరిమితం చేయకుండా ప్రయోగాత్మకంగా నేర్పడం ఎంతో ముఖ్యమని, ప్రతి విద్యార్థి ప్రయోగాల్లో స్వయంగా పాల్గొనేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని సూచించారు. ప్రయోగశాలను సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, ఆసక్తి పెంపొందించేలా బోధన సాగాలని అన్నారు.కొత్తగా చేరిన కొంతమంది విద్యార్థులకు యూనిఫాంలు ఇంకా అందలేదని ప్రిన్సిపల్ వివరించడంతో, అర్హులైన విద్యార్థులందరికీ యూనిఫాంలు త్వరగా అందేలా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.భోజనశాల, వంటగది, మరుగుదొడ్లను పరిశీలించిన కలెక్టర్ పరిశుభ్రత లోపాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాల భోజనశాల, వంటగది, మరుగుదొడ్లు, పరిసరాలను నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. వంట సిబ్బందితో మాట్లాడి విద్యార్థులకు అందుతున్న ఆహారం వివరాలను తెలుసుకున్నారు. ప్రధాన వంట మనిషి అనారోగ్యంతో సెలవులో ఉన్నట్లు తెలియడంతో, విద్యార్థులకు భోజనంలో అంతరాయం లేకుండా ప్రత్యామ్నాయ వంట మనిషిని వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు.స్టోర్ రూమ్‌లోని కూరగాయలు, రిఫ్రిజిరేటర్‌లోని పాలు, పెరుగు నాణ్యతను పరిశీలించిన కలెక్టర్, ఫుడ్ సేఫ్టీ అధికారుల ద్వారా నాణ్యత పరీక్షలు నిర్వహించాలని, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం మాత్రమే అందేలా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.అనంతరం పాఠశాలలోని వెల్నెస్ సెంటర్‌ను పరిశీలించిన కలెక్టర్ అక్కడ అందుబాటులో ఉన్న మందులను తనిఖీ చేశారు. మందుల నిల్వ, వినియోగానికి సంబంధించిన రిజిస్టర్లను పరిశీలించి, విద్యార్థులకు అవసరమైన వైద్య సేవలు, మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన విద్యాబోధన, ప్రయోగాత్మక విద్య, ఆహారం, పరిశుభ్రత, ఆరోగ్యం, హాజరు తదితర అంశాల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేదని కలెక్టర్ అంకిత్ స్పష్టం చేశారు. పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు తమ బాధ్యతలను పూర్తి జవాబుదారీతనంతో నిర్వహిస్తూ విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించాలని ఆదేశించారు.ఈ తనిఖీల్లో కలెక్టర్ వెంట తాసిల్దార్ వీరభద్రం, ఎంపీడీవో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :