తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం డిప్యూటీ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ అబ్దుల్ రెహమాన్ జూలూరుపాడు పోలీస్ స్టేషన్ నందు సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించి తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీలో భాగంగా, రికార్డులను పరిశీలించి, పెండింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ, గ్రామాల్లో పెట్రోలింగ్, డయల్ 100 ఫిర్యాదులపై సత్వర స్పందన వంటి విషయాలపై డీఎస్పీ సీఐ శ్రీలక్ష్మిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జూలూరుపాడు సబ్ ఇన్స్పెక్టర్ బాధావత్ రవి, చండ్రుగొండ సబ్ ఇన్స్పెక్టర్ శివరామకృష్ణ, అన్నపురెడ్డిపల్లి సబ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ మరియు జూలూరుపాడు పోలీస్ స్టేషన్ సిబ్బంది వున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ