తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం 2టౌన్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సమస్యాత్మక వ్యక్తులను గుర్తించి వారి కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసుకోవాలి ఈ రోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ గారు కొత్తగూడెం 2టౌన్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించారు.ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు.అనంతరం అక్కడ ఉన్న పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి పలు సూచనలు చేశారు.పోలీస్ స్టేషన్ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని,వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు న్యాయం చేకూర్చే విధంగా బాధ్యతగా మెలగాలని సూచించారు.విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు.అనంతరం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పలు కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సమస్యాత్మక వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కదలికలపై ఎప్పటికప్పుడు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు.పోలీస్ స్టేషన్లో పనిచేసే అధికారులు సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 2టౌన్ ఇన్స్పెక్టర్ ప్రతాప్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ