తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భారత ప్రభుత్వం యువజన వ్యవహారాల మరియు క్రీడల మంత్రిత్వశాఖ 2025-26 ఆర్థిక సంవత్సరమునకు గాను మేర యువ భారత్ ఖమ్మం వారి ఆధ్వర్యంలో క్రీడా సామగ్రి పంపిణీ చేయుటకు ఉమ్మడి ఖమ్మం జిల్లాల యువజన సంఘాల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తునట్టు మేర యువ భారత్ ఉమ్మడి ఖమ్మం జిల్లా డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేష్ శనివారం తెలిపారు. మై భారత్ వెబ్ సైట్ లో రిజిస్టర్ అయిన ఉమ్మడి జిల్లాలు అనగా ఖమ్మం మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలోని యువజన సంఘాలు మేర యువ భారత్ కేంద్రంలో అనుసందనమైన యువజన సంఘాలు ,మహిళ మండలిల నుండి దరఖాస్తు ఈ నెల 31 వ తేదీ లోగా మేర యువ భారత్ కేంద్ర లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. క్రీడా సామాగ్రికి దరఖాస్తు తో యువజన సంగం మై భారత్ వెబ్సైట్ రిజిస్ట్రేషన్ జిరాక్స్ తో పాటుగా వారి యొక్క బైలాస్ కాపీని కూడా జత చేయాలి, అదే మాదిరిగా గత కాలంలో వారు చేసినటువంటి కార్యక్రమాల పత్రికా ప్రకటనలు, ఫోటోలు జత చేయాలి. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి యువజన సంఘాలకు, మహిళ మండలిలకు క్రీడా సామగ్రి ఇవ్వనునట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు మేర యువ భారత్ కేంద్రం కార్యాలయంలో లేదా 8790601617, +91 90004 32563 ఫోన్ నంబర్ ను సంప్రదించాలని కోరారు.
Admin
తెలుగు వెలుగు టీవీ