Wednesday, 04 November 2026 12:59:21 PM
# తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TDPS) విడుదల చేసిన తాజా వాతావరణ నివేదిక ప్రకారం ముఖ్యాంశాలు # భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం.

న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేయాలి : కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్కినేని సత్యనారాయణ

Date : 16 July 2025 04:52 PM Views : 813

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : న్యాయవాదుల సంక్షేమానికి కొత్త కోర్టులు,హెల్త్ కార్డులు, గృహ స్థలాల కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంగా నూతన న్యాయస్థానాల ఏర్పాటుకు కృషి చేయాలని కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్కినేని సత్యనారాయణ కోరారు.బుధవారం న్యాయవాదుల సంఘం లైబ్రరీ హాల్ నందు కాంగ్రెస్ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు వెల్లంకి వెంకటేశ్వరరావు అధ్యక్షతన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మోతుకురీ ధర్మారావు,నాగ సీతారాములు,రాజ్యాంగ పరిరక్షణ రాష్ట్ర కమిటీ సభ్యులు జే.బీ.శౌరి, జైభీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ ల సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన లక్కినేని సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క,ఉమ్మడి జిల్లా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,తుమ్మల నాగేశ్వరరావుల ద్వారా ప్రభుత్వం దృష్టికి ఈ విషయాలను తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ఎస్సీ-ఎస్టీ కోర్టు,ఫ్యామిలీ కోర్టు,లేబర్ కోర్టు వంటి నూతన న్యాయస్థానాల ఏర్పాటుకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు.ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ల, గవర్నమెంట్ ప్లీడర్ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని,కొత్తగా నోటరీ నోటిఫికేషన్ విడుదల చేయాలని,2019 తర్వాత ఎన్రోల్ అయిన ప్రతీ న్యాయవాదికి హెల్త్ కార్డులు మంజూరు చేయాలని,ప్రస్తుతం ఉన్న హెల్త్ కార్డ్ ల పరిమితిని రెండు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయలకు పెంచాలని కోరారు.అలాగే అర్హులైన న్యాయవాదులకు గృహ స్థలాలు మంజూరు చేయాలని,న్యాయవాదుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు ప్రభుత్వం సంకల్పబద్ధంగా ముందుకు వస్తుందని,నూతన న్యాయస్థానాల ఏర్పాటుతో పాటు వాటికి సంబంధించిన న్యాయసౌధాల నిర్మాణం,న్యాయమూర్తుల నివాస గృహాల నిర్మాణం కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తామని సన్మాన గ్రహీతలు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి భాగం మాధవ్ రావు,రేపాక వెంకటరత్నం,పలివెల సాంబశివరావు,వి.వి.సుధాకర్ రావు,వై.వి.రామారావు,రావి విజయ్ కుమార్,ఊట్ల రాజేశ్వరరావు,ఎర్రపాటి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :