Monday, 02 November 2026 05:32:43 PM
# ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్. # బస్సు కండక్టర్‌పై దాడి దురదృష్టకరం. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలి.కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # భారత కార్మిక పోరాట దిక్సూచి ఏఐటీయూసీ. 106 ఏళ్ల ఘన చరిత్ర కార్మిక వర్గానికే సొంతం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా. # విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడంలో నిర్లక్ష్యం సహించేది లేదు: కలెక్టర్ అంకిత్. # భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా మెగా రక్తదాన శిబిరం.రక్తదానం ప్రాణదానంతో సమానం – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # జీవో నెంబర్ 76 లో జరుగుతున్న అవకతవకలపై విచారణ జరిపించాలి.జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # కొత్తగూడెంలో కాంగ్రెస్ నూతన కార్యాలయం కోసం స్థల పరిశీలన. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. # జ్ఞానేష్ కుమార్ రాజీనామాకై రాజీలేని పోరాటం.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా.

రైతుల డిజిటల్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాలి : డీఆర్ఓ పద్మావతి

Date : 31 October 2026 01:51 PM Views : 93

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అగ్రిస్టాక్‌ ద్వారా రైతు రిజిస్ట్రీ, డిజిటల్‌ క్రాప్‌ బుకింగ్‌ వందశాతం పూర్తి చేయాలి ప్రభుత్వ పథకాలు, పంట రుణాలు, పంటల కొనుగోలులో రైతు ఐడీ కీలకం జిల్లాలో అగ్రిస్టాక్‌ యాప్‌ ద్వారా చేపడుతున్న రైతు రిజిస్ట్రీ, డిజిటల్‌ క్రాప్‌ బుకింగ్‌ ప్రక్రియను వేగవంతం చేసి వందశాతం లక్ష్యాన్ని సాధించాలని జిల్లా రెవెన్యూ అధికారి పద్మావతి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శనివారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేశంలో వివిధ శాఖల అధికారులతో కార్యక్రమం పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో డిజిటలైజేషన్‌లో భాగంగా అగ్రిస్టాక్‌ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని తెలిపారు. ఇందులో భాగంగా భూమి కలిగిన ప్రతి రైతుకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య (ఫార్మర్‌ ఐడీ) కేటాయించేందుకు రైతు రిజిస్ట్రీ చేపట్టినట్లు వివరించారు. జిల్లాలో మొత్తం 1.85 లక్షల మంది రైతులకు గాను ఇప్పటివరకు సుమారు 1.39 లక్షల మంది రైతుల రిజిస్ట్రేషన్‌ పూర్తయిందని, మరో 45 వేల మంది రైతుల నమోదు చేయాల్సి ఉందని తెలిపారు. మిగిలిన రైతులందరి వివరాలను నమోదు చేసి వందశాతం లక్ష్యాన్ని సాధించేందుకు అన్ని శాఖలు సహకరించాలని కోరారు. అలాగే డిజిటల్‌ క్రాప్‌ బుకింగ్‌లో భాగంగా గ్రామస్థాయిలో వాలంటీర్లను గుర్తించి క్షేత్రస్థాయిలో పంటల ఫొటోలు సేకరించి యాప్‌లో నమోదు చేస్తున్నట్లు తెలిపారు. పంటల సాగు విస్తీర్ణం, పంటల వివరాలు ఖచ్చితంగా నమోదయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా సేకరించిన సమాచారం భవిష్యత్తులో వివిధ ప్రభుత్వ శాఖలకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. డీఆర్ఓ పద్మావతి మాట్లాడుతూ, రైతు రిజిస్ట్రీ ద్వారా రూపొందే రైతుల సమగ్ర సమాచారం వ్యవసాయం, ఉద్యానవనం, మార్కెటింగ్‌, పౌరసరఫరాలు, బ్యాంకింగ్‌, గ్రామీణాభివృద్ధి తదితర శాఖలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. రైతులకు పంట రుణాలు, ఆర్థిక సేవలు అందించడం, ధాన్యం, మొక్కజొన్న, పత్తి తదితర పంటల కొనుగోలు, పంటల బీమా, ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగినప్పుడు పరిహారం అందించే ప్రక్రియలో ఫార్మర్‌ ఐడీ కీలకంగా ఉంటుందని వివరించారు. ఉద్యానవన శాఖ ద్వారా ఆయిల్‌పామ్‌ సాగు, డ్రిప్‌ ఇరిగేషన్‌ వంటి పథకాల అమలులో, డీఆర్డీఏ ద్వారా రైతులకు ఫామ్‌ పాండ్స్‌, ఇంకుడు గుంతలు, రీఛార్జ్‌ పిట్స్‌ వంటి సదుపాయాలు కల్పించే సమయంలో రైతు ఐడీని తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు తమ పరిధిలోని రైతులకు ఫార్మర్‌ ఐడీ ప్రాధాన్యతను వివరించి రిజిస్ట్రేషన్‌ చేసుకునేలా ప్రోత్సహించాలని ఆదేశించారు. రైతు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను మీసేవ, కామన్‌ సర్వీస్‌ సెంటర్లు, మండల వ్యవసాయ కార్యాలయాల ద్వారా సులభంగా పూర్తి చేసుకోవచ్చని తెలిపారు. పట్టాదారు పాస్‌బుక్‌, ఆధార్‌ కార్డు, మొబైల్‌ నంబర్‌తో రైతులు సమీప కేంద్రాల్లో నమోదు చేసుకోవచ్చని వివరించారు. మీసేవ, సీఎస్‌సీ కేంద్రాలకు వచ్చే రైతులకు ఫార్మర్‌ ఐడీ నమోదు విషయంలో అవగాహన కల్పించి అవసరమైన సహకారం అందించాలని ఆదేశించారు . రైతు రిజిస్ట్రీ, డిజిటల్‌ క్రాప్‌ బుకింగ్‌ కార్యక్రమాల విజయవంతమైన అమలుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని డీఆర్ఓ పద్మావతి సూచించారు. ఈ సమావేశంలో సీ పి ఓ సునీత,లీడ్ బ్యాంకు మేనేజర్ రామిరెడ్డి , ఈ-డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌ సైదేశ్వర రావు , ఉద్యానవన శాఖ, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌, పౌరసరఫరాలు, మార్కెటింగ్‌, ఐటీడీఏ, గిరిజన సంక్షేమం, నాబార్డ్‌, లీడ్‌ బ్యాంక్‌, పశుసంవర్ధక, సహకార, డీఆర్డీఏ తదితర శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :