Wednesday, 16 September 2026 11:31:33 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

అలియాస్ పేర్ల సమస్య పరిష్కారానికి కమిటీ

Date : 17 August 2026 04:10 PM Views : 67

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : నెల రోజుల్లో సమస్యకు శాశ్వత పరిష్కారం కార్మికుల వారసుల దీక్షల విరమణ సమస్యను పరిష్కరించకుంటే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం డిస్మిస్డ్ కార్మికులనూ మానవతా దృక్పథంతో చూడాలి : కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సింగరేణి సంస్థలో మారుపేర్లతో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను నెల రోజుల్లో పరిష్కరించేందుకు యాజమాన్యం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిందని, ఈ నిర్ణయంతో కార్మికుల వారసులకు న్యాయం జరుగుతుందని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట అలియాస్ పేర్ల బాధితులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షలను సోమవారం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సింగరేణి పర్సనల్ జనరల్ మేనేజర్ కిరణ్ కుమార్ బాధితులకు నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పూర్వం కార్మికులు దొరకని రోజుల్లో ఉద్యోగాల్లో చేరినప్పుడు పేర్లలో తప్పులు దొర్లాయని, దీనివల్ల నేడు వారి పిల్లలకు ఉద్యోగాలు రాక తీవ్ర మానసిక ఆందోళన చెందుతున్నారన్నారు, తప్పుడు పేర్లు ఉన్నాయని సింగరేణి విజిలెన్సు విభాగం విచారణపేరుతో వేధింపులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. విజిలెన్సు విచారణలో ఉండటంతో వారసులకు యాజమాన్యం ఉద్యోగాలు ఇవ్వండంలేదన్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం కోల్ బెల్ట్ ఎమ్మెల్యేల సమావేశంలో యాజమాన్యంతో చర్చించామని తెలిపారు. ఫలితంగా ముగ్గురు యాజమాన్య ప్రతినిధులు, ఇద్దరు ఏఐటీయూసీ, ఒకరు ఐఎన్‌టీయూసీ ప్రతినిధులతో కూడిన ఆరుగురు సభ్యుల కమిటీని యాజమాన్యం ఏర్పాటు చేసిందన్నారు. ఈ కమిటీ నెల రోజుల్లో సమస్యను అధ్యయనం చేసి పరిష్కార మార్గాన్ని చూపుతుందని ఆయన స్పష్టం చేశారు. యాజమాన్యం ఇచ్చిన హామీ మేరకు నెలరోజుల్లో సమస్యను పరిష్కరించని పక్షంలో కార్మిక వారసుల ఉద్యమ కార్యాచరణ ప్రకటించి పోరాడతామని, ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి పరిస్కారానికి కృషిచేస్తానని స్పష్టం చేశారు. అలాగే గతంలో వివిధ కారణాలతో డిస్మిస్ అయిన కార్మికుల సమస్యను కూడా యాజమాన్యం మానవతా దృక్పథంతో పరిశీలించి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, యూనియన్ నాయకులు వంగ వెంకట్, జి వీరాస్వామి, శేషయ్య, రమణమూర్తి, గట్టయ్య, కిష్టాఫర్, సందెబోయిన శ్రీనివాస్, మాతంగి లింగయ్య, బండారి మల్లయ్య, నర్సయ్య, కార్మికుల వారసులు లక్క శ్రావణ్, ధనాల రాజేందర్, జె రాజేందర్, డిష్ బాబు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :