Friday, 18 September 2026 08:09:44 PM
# ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు.

గురుకుల విద్యాసంస్థలలో పార్టమ్ అధ్యాపకుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం.

Date : 04 July 2026 08:55 PM Views : 706

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు మరియు కళాశాలల సొసైటీ (TGSWREIS), భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని 8 గురుకుల పాఠశాలలు/కళాశాలలు మరియు ఒక గురుకుల డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న 34 పార్టెమ్ అధ్యాపక పోస్టులను భర్తీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ ఒక ప్రకటనలో తెలిపారు. ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయని పేర్కొన్నారు.డిగ్రీ లెక్చరర్లు (DL) - 05 పోస్టులు.జూనియర్ లెక్చరర్లు (JL) - 13 పోస్టులు.పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు (PGT) -03 పోస్టులు ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (TGT) 05 పోస్టులు.లైబ్రేరియన్లు (Librarian) 02 పోస్టులు. హెల్త్ సూపర్వైజర్ (HS) – 01 పోస్టు. ఆర్ట్ / క్రాఫ్ట్ / మ్యూజిక్ టీచర్లు 05 పోస్టులు.ఈ పోస్టులకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.విద్యార్హతలు:సైన్స్ సబ్జెక్టులకు: సంబంధిత సబ్జెక్టులో ఎం.ఎస్సి., బి.ఎడ్. లాంగ్వేజ్ సబ్జెక్టులకు: సంబంధిత సబ్జెక్టులో ఎం.ఏ., బి.ఎడ్. ఆర్ట్ & క్రాఫ్ట్, మ్యూజిక్ మరియు ఇతర స్పెషల్ టీచర్ పోస్టులకు: సంబంధిత సబ్జెక్టులో పీజీ లేదా నిబంధనల ప్రకారం నిర్దేశించిన విద్యార్హతలు కలిగి ఉండాలి.అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను సంబంధిత విద్యార్హతల ధ్రువపత్రాల ప్రతులతో కలిసి 07-07-2026 తేదీ సాయంత్రం 3.00 గంటలలోపు క్రింది చిరునామాలో సమర్పించవచ్చని తెలిపారు.దరఖాస్తు చేసిన అభ్యర్థులకు 08-07-2026 తేదీ ఉదయం 10.00 గంటల నుండి టి.జి.ఎస్.డబ్ల్యూ. ఆర్. ఎస్./జూనియర్ కళాశాల (బాలుర), సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE), పాల్వంచలో ఎంపిక కమిటీ సమక్షంలో టీచింగ్ డెమోలు నిర్వహించబడతాయని తెలిపారు. డెమోలకు హాజరయ్యే అభ్యర్థులు తమ ఒరిజినల్ విద్యార్హత ధ్రువపత్రాలు, ఒక సెట్ జిరాక్స్ ప్రతులు మరియు గుర్తింపు కార్డుతో తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. డెమోలో అభ్యర్థుల బోధనా నైపుణ్యం, సబ్జెక్టుపై అవగాహన, కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు ప్రతిభ ఆధారంగా ఎంపిక కమిటీ తుది ఎంపిక చేపట్టి పార్ట్టైమ్ అధ్యాపకులుగా నియమించడం జరుగుతుందని తెలిపారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :