Tuesday, 03 November 2026 03:36:57 AM
# ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్.

మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 16 October 2024 06:07 PM Views : 581

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : బుధవారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ చేపడుతున్న ఐసిడిఎస్ ఆక్టివిటీస్, చైల్డ్ ప్రొటెక్షన్, అడాప్షన్ మరియు చైల్డ్ హెల్ప్ లైన్ పై అధికారులతో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ లోప పోషణకు గురైన పిల్లలను సాధారణ స్థితికి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని, ప్రతి అంగన్వాడీ కేంద్రం నందు త్రాగునీటి వసతి, విద్యుత్, మరుగుదొడ్లు మొదలైన కనీస వసతులు కల్పించాలని అన్నారు. అదేవిధంగా జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో మునగ, కరివేపాకు, ఉసిరి, చింత మరియు వెలగ మొక్కలు తప్పనిసరిగా నాటాలని ఆదేశించారు. ఈ మొక్కలు నాటి వినియోగించడం ద్వారా విటమిన్ ఏ, సి, డి మరియు క్యాల్షియం పుష్కలంగా వస్తాయని దీని ద్వారా పిల్లలు ఆరోగ్యవంతంగా ఉంటారని అన్నారు. జిల్లాలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాల వివరాలు, స్థలం వివరాలు అందజేయాలని సిపిడిఓ లను ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాలు మరియు ఐసిడిఎస్ కార్యాలయం ల నిర్మాణంకు త్వరలోనే స్థలం కేటాయిస్తామన్నారు.

జిల్లాలో బాల కార్మికుల నిర్మూలన, బాలల భిక్షాటన మరియు బాల్య వివాహాల నిర్మూలన కోసం డి సి పి యు సమన్వయంగా పనిచేసి జిల్లాను బాలల స్నేహపూరిత జిల్లాగా మార్చాలని అన్నారు. జిల్లాలోని అన్ని అంగన్వాడి కేంద్రాల్లో తమ పరిధిలో ఎంతమంది పిల్లలు మరియు గర్భిణీ స్త్రీలు ఉన్నారో వారి ఖచ్చితమైన వివరాలను నిర్దేశించిన పట్టిక ద్వారా నమోదు చేయాలని ఆదేశించారు. ఖచ్చితమైన వివరాలు నమోదు చేయడం ద్వారా వారి ఆరోగ్య స్థితికి అనుగుణంగా వైద్యశాఖ అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉందని కలెక్టర్ అన్నారు. సమీక్ష సమావేశంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి స్వర్ణలత లేనిన, ప్రాజెక్ట్ సీపీడీవోలు, సిడబ్ల్యుసి మెంబర్లు, డి సి పి యు యూనిట్ మరియు చైల్డ్ హెల్ప్ లైన్ 1098సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :