తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం సెప్టెంబర్ 20 (తెలుగు వెలుగు) జూలూరుపాడు మండలం అనంతారం గ్రామంలో పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా అంగనవాడి కేంద్రంలో నలుగురు గర్భిణీ స్త్రీలకు. పూలు , పండ్లు, పసుపు కుంకుమలతో సీమంతం చేశారు. గర్భిణీ స్త్రీలు గడిగా నాగేశ్వరి, ఈసం శ్రీలత, ఈసం మమత, చెట్ల అనిలా మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రముగా శ్రీమంత కార్యక్రమం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జూలూరుపాడు సెక్టార్ సూపర్వైజర్ ఎం నాగమణి, అంగన్వాడి స్కూల్ టీచర్ టి సుజాత మరియు గ్రామస్తులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ