Friday, 18 September 2026 09:46:01 AM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా UPHC రామవరం లో అవగాహన కార్యక్రమం

Date : 08 June 2026 06:45 PM Views : 220

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మన ఆరోగ్యం మన చేతుల్లోనే : Dr తుకారాం రాథోడ్ DMHO ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా UPHC రామవరం నందు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ (DMHO) ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు. ఈ సందర్భంగా “మన ఆరోగ్యం మన చేతుల్లోనే” అనే నినాదంతో పర్యావరణ పరిరక్షణ మరియు ప్రజారోగ్యంపై విస్తృత అవగాహన కల్పించారు. డాక్టర్ తుకారాం రాథోడ్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి అనేవి సమాజ ఆరోగ్యానికి అత్యంత కీలకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ ఆరోగ్య దినోత్సవాల ప్రాముఖ్యతపై కూడా అవగాహన కల్పించారు, వాటిలో: ప్రపంచ పర్యావరణ దినోత్సవం ప్రపంచ మెదడు కణితులు (Brain Tumours) దినోత్సవం ప్రపంచ సముద్రాల దినోత్సవం అలాగే “RRR – Reduce, Reuse, Recycle” ద్వారా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని, పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. Anti Malaria Month ఇంటి పరిసర ప్రాంతాల్లో నీరు నిలువ లేకుండా ఉంచుకోవాలని ప్రతి శుక్రవారం ఫ్రైడే ఫ్రైడే పాటించాలని, కూలర్లు, కుండ పెంకులు, ఫ్రిజ్ , టైర్లు , కొబ్బరి బోండాలు ప్లాస్టిక్ కవర్లు, రోళ్ళు , ఖాళీ సీసాలు, పగిలిపోయిన ప్లాస్టిక్ డబ్బులు, పూల కుండీలు మొదలగు వాటిలో వర్షపు నీరు నిలువ ఉండి దోమలు పెరిగే అవకాశం ఉంటుంది , దోమ కాటువలన మలేరియా , డెంగ్యూ, చికెన్ గునియా, బోదకాలు, మెదడువాపు ,మొదలగు వ్యాధులు వచ్చే అవకాశం ఉందని తెలియజేశారు చిన్న దోమ కాటు వలన ప్రాణాంతకమైన వ్యాధులు వస్తాయని ఇంటి పరిసర ప్రాంతాల్లో పనికిరాని వస్తువులను తీసివేయాలని నీరు నిలువ లేకుండా చూసుకోవాలని, నీటి గుంటలలో కిరోసిన్ , బండి ఆయిల్ మొదలైనవి వేసుకోనుట ద్వారా దోమ పిల్లలు పెరగకుండా నివారించవచ్చని తెలియజేశారు , వర్షాకాలంలో నీరు నిలువ లేకుండా ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలని తెలియజేశారు , Anti Diarrhoea Month బాగంగా ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత, ఇంటి పరిసరాల శుభ్రత పాటించాలని సూచించారు, మరుగుదొడ్లను వాడిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి, పాలిచ్చే తల్లులు వంట చేసే వారు చేతులను శుభ్రంగా కడుకోవాలని తెలియజేశారు , చేతి గోర్లను తరచుగా కత్తిరించుకోవాలని నోటిలో పెట్టి కత్తిరించడం మానుకోవాలని తెలియజేశారు, చేతుల శుభ్రం లేకపోవడం వలన అనేక అంటూ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని తెలియజేశారు, ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు ఎవరికైనా డయేరియా లక్షణాలు కల్పించినట్లయితే జింక్ మరియు ఓఆర్ఎస్ పాకెట్స్ అందించి దగ్గర్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సదుపాయం తీసుకోవాలని తెలియజేశారు , 14 సంవత్సరాల వయసు కిశోర బాలికలకు HPV టీకా (HPV Vaccine) ప్రాముఖ్యతను వివరించి, సకాలంలో టీకాలు తీసుకోవడం ద్వారా గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ వంటి వ్యాధులను నివారించవచ్చని తెలిపారు. అర్హులైన బాలికలకు అందరికీ HPV వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సహించాలని తెలియజేశారు ఈ సందర్భంగా డాక్టర్ తుకారాం రాథోడ్ UPHC రామవరం నందు మొక్క నాటడం ద్వారా పచ్చదనాన్ని పెంపొందించాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తూ మొక్కలు నాటారు. “మన ఆరోగ్యం మరియు పర్యావరణ ఆరోగ్యం పరస్పరం అనుసంధానమై ఉన్నాయి. పర్యావరణాన్ని కాపాడితేనే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమవుతుంది.” “ఆరోగ్యకరమైన పర్యావరణం – ఆరోగ్యకరమైన జీవితం” “Reduce, Reuse, Recycle – ప్లాస్టిక్‌ను తగ్గిద్దాం, భవిష్యత్తును కాపాడుదాం” ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు పద్మ , శంకర్ , సుధాకర్ రాజు, శంకరమ్మ నర్సింగ్ ఆఫీసర్, శ్రీనివాసరావు కమ్యూనిటీ కోఆర్డినేటర్, రాజేశ్వరి ,దిలీప్, ఆరోగ్య సిబ్బంది ఆశా కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :