Tuesday, 03 November 2026 12:34:57 AM
# ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్.

ఎలివేటెడ్ షెడ్ల వల్ల జీవాల్లో అంటురోగాలు నివారించవచ్చు – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

Date : 08 December 2025 06:53 PM Views : 200

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఎలివేటెడ్ షెడ్ల వల్ల జీవాల్లో అంటురోగాలు నివారించవచ్చు అని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు.మద్దూకూరు గ్రామం లో రైతు తలారి రవి ఏర్పాటు చేసిన ఎలివేటెడ్ మేకలు/గోర్రెల పెంపక షెడ్‌ను పరిశీలించారు సోమవారం కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎలివేటెడ్ షెడ్ విధానం పశుసంవర్థక రంగంలో ఆధునిక, శాస్త్రీయ పద్ధతి అని, ఈ విధానం ద్వారా జీవుల్లో అంటు వ్యాధులు గణనీయంగా తగ్గుతాయని అన్నారు. ముఖ్యంగా చిన్న పిల్లల మరణాల శాతం ఈ విధానంతో స్పష్టంగా తగ్గడం శుభపరిణామమని అన్నారు. ఎలివేటెడ్ ఫ్లోరింగ్ కారణంగా పేడ, మూత్రం నేలపై నేరుగా పడిపోవడం వల్ల ఫ్లోర్ ఎప్పటికప్పుడు పొడి, పరిశుభ్రంగా ఉంటుంది. దీని వలన తడి లేకుండా శుభ్రమైన వాతావరణం ఏర్పడి, జీవుల్లో అంటు వ్యాధులు ప్రబలే అవకాశాలు తగ్గుతాయి అని తెలిపారు. పరిశుభ్రత పెరగడం వల్ల జీవాలు ఆరోగ్యంగా పెరిగి, పెరుగుదల శాతం కూడా గణనీయంగా మెరుగవుతుందని చెప్పారు. అలాగే రైతు తలారి రవి స్వయంగా రూపొందించిన గడ్డి కోసే యంత్రం, ఫర్నిచర్ యూనిట్, ఫీడ్ మిక్చర్ వంటి వినూత్న ఆవిష్కరణలను కలెక్టర్ పరిశీలించి అభినందించారు. గ్రామీణ స్థాయిలో రైతులు ఇలాంటి సృజనాత్మకతను ప్రదర్శించడం పశుసంవర్థక రంగ అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. ఎలివేటెడ్ షెడ్ నిర్మాణ వివరాలను కూడా కలెక్టర్ ఈ సందర్భంగా వివరించారు. భూమికి 4–6 అడుగుల ఎత్తులో ఫ్లోర్‌ను ఎత్తుగా ఏర్పాటు చేసి, సుమారు 20–25 మేకలు/గోర్రెల కోసం 21 అడుగుల పొడవు, 14 అడుగుల వెడల్పు, 12 అడుగుల ఎత్తుతో షెడ్‌ను నిర్మించవచ్చని సూచించారు. సరైన గాలి ప్రసరణ, వెలుతురు మరియు పొడి వాతావరణం ఉండేలా ఈ షెడ్‌లను డిజైన్ చేయడం అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశువైద్య & పశుసంవర్థక శాఖ అధికారి డా. వెంకటేశ్వర్లు, మండల పశుసంవర్ధక అధికారి డాక్టర్ ఎం వి సంతోష్, రెవెన్యూ అధికారి సంధ్యారాణి, రైతు తలారి రవి మరియు స్థానిక రైతులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :