తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను బుధవారం హైదరాబాద్ తెలంగాణ భవన్లో కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం స్టేట్ చీఫ్ జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ కు పూల మొక్కను బహుకరించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని వారికి కేటీఆర్ సూచించారు. కొత్తగూడెం నియోజకవర్గంలో BRS పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని చెప్పారు
Admin
తెలుగు వెలుగు టీవీ