తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ రాష్ట్రంలో ట్రాన్స్‌పోర్ట్ శాఖ చెక్ పోస్టులు తక్షణం మూసివేత.ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని ట్రాన్స్‌పోర్ట్ చెక్ పోస్టులు మూసివేయాలని ఉత్తర్వులు డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్లు, జిల్లా ట్రాన్స్‌పోర్ట్ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలి.చెక్ పోస్టుల వద్ద ఉన్న బోర్డులు, బారికేడ్లు, సిగ్నేజ్ తొలగించాలి. సిబ్బందిని ఇతర శాఖలకు తిరిగి నియమించాలి – చెక్ పోస్టుల వద్ద ఎవరూ ఉండరాదు.చెక్ పోస్టుల వద్ద వాహనాల రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలి.రికార్డులు, ఫర్నీచర్, పరికరాలు వెంటనే జిల్లా ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయానికి తరలించాలి.ఆర్థిక మరియు పరిపాలనా రికార్డులను సమన్వయం చేసి భద్రపరచాలి.ప్రజలకు అసౌకర్యం కలగకుండా తగిన ప్రకటనలు ఇవ్వాలని ఆదేశాలు. చెక్ పోస్టు మూసివేతపై సమగ్ర నివేదిక ఈరోజే సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాలి.
Admin
తెలుగు వెలుగు టీవీ