తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పాల్వంచ మండలం ప్రశాంత్ కాలనీలో కేటీపీఎస్ ఉద్యోగి ఉప్పెల్లి పాపారావు (35) శుక్రవారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పాపారావు ఈ దారుణానికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Admin
తెలుగు వెలుగు టీవీ