Wednesday, 04 November 2026 01:00:45 PM
# మహిళా కండక్టర్ ప్రవళిక మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి # తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TDPS) విడుదల చేసిన తాజా వాతావరణ నివేదిక ప్రకారం ముఖ్యాంశాలు # భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు.

గోదావరి పుష్కరాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్.వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్.

Date : 07 September 2026 08:25 PM Views : 174

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గోదావరి పుష్కరాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి : దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్. టైర్– 1 లో ప్రతిపాదించిన అన్ని అభివృద్ధి పనులకు పకడ్బందీ కార్యాచరణ. భూసేకరణ ప్రతిపాదనలు వెంటనే పంపి ఆమోదాలు పొందాలి.టెండర్ల ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా పనులు ప్రారంభించాలి.వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అంకిత్.గోదావరి పుష్కరాల సందర్భంగా టైర్–1లో ప్రతిపాదించిన అన్ని అభివృద్ధి పనులు సకాలంలో అమలు అయ్యేలా పకడ్బందీ కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రతిపాదనలు, పరిపాలనా ప్రక్రియలకే పరిమితం కాకుండా పనులను వీలైనంత త్వరగా క్షేత్రస్థాయిలో ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.సోమవారం దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్, కమిషనర్ హనుమంతరావుతో కలిసి సంబంధిత జిల్లా కలెక్టర్లతో గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అంకిత్ ఐడీఓసీలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్ మాట్లాడుతూ, గోదావరి పుష్కరాల టైర్–1లో ప్రతిపాదించిన అభివృద్ధి పనులన్నీ సకాలంలో పూర్తయ్యేలా స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. పనులు త్వరగా ప్రారంభమయ్యేలా అన్ని ముందస్తు చర్యలు పూర్తి చేయాలని ఆదేశించారు.అభివృద్ధి పనులకు అవసరమైన భూసేకరణ ప్రతిపాదనలను వెంటనే ప్రభుత్వానికి పంపించి, ఆమోదాలు త్వరగా పొందేలా నిరంతరం ఫాలోఅప్ చేయాలని తెలిపారు. అభివృద్ధి పనులకు సంబంధించిన టెండర్ ప్రక్రియను కూడా వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. టెండర్ల పేరుతో పనుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు నిర్వహించాలని, పనులు ప్రారంభమైన వెంటనే అవసరమైన కార్మికులు, నిర్మాణ సామగ్రి, యంత్రాలు తదితర వనరులను అందుబాటులో ఉంచుకునేలా ముందస్తు ప్రణాళిక చేసుకోవాలని సూచించారు. ప్రతి అంశాన్ని సూక్ష్మస్థాయిలో పర్యవేక్షిస్తూ, పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని తెలిపారు.టెండర్లకు కాంట్రాక్టర్లు స్పందించేలా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. ఇంజినీరింగ్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, అవసరమైన సందర్భాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులతో సమన్వయం చేసుకుని సమస్యలను వెంటనే పరిష్కరించుకోవాలని ఆదేశించారు.దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు మాట్లాడుతూ , గోదావరి పుష్కరాల అభివృద్ధి పనుల పర్యవేక్షణ కోసం ప్రతి జిల్లాకు ఒక నోడల్ అధికారిని నియమించినట్లు తెలిపారు. నోడల్ అధికారి సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. గోదావరి పుష్కరాల అభివృద్ధి పనులకు అవసరమైన భూసేకరణ ప్రతిపాదనలను వెంటనే ప్రభుత్వానికి పంపించాలని కమిషనర్ ఆదేశించారు. భూసేకరణ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసేలా సంబంధిత అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని సూచించారు. భూసేకరణ, టెండర్లు, ఇతర అనుమతుల ప్రక్రియల్లో ఎలాంటి జాప్యం లేకుండా పనులను వేగవంతం చేయాలని తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ , జిల్లాలో గోదావరి పుష్కరాల టైర్–1లో ప్రతిపాదించిన అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. భూసేకరణ, టెండర్ ప్రక్రియలను వేగవంతం చేసి పనులు త్వరగా ప్రారంభించేలా సంబంధిత శాఖలతో సమన్వయం చేస్తున్నామని పేర్కొన్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేస్తామని తెలిపారు.జిల్లాలో గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించి శాఖల వారీగా చేపట్టాల్సిన పనులను సమన్వయం చేసుకుంటూ, పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :