Wednesday, 04 November 2026 09:12:07 AM
# సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు.

ఎస్‌ఐఆర్ ప్రక్రియను వేగవంతంగా, నిబంధనల మేరకు పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 13 July 2026 01:49 PM Views : 209

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ అంకిత్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) హెల్ప్‌డెస్క్‌ను పరిశీలించారు. కొత్తగూడెం పరిధిలోని 66 పోలింగ్ కేంద్రాల్లో బీఎల్‌వోలు ఫారాల పంపిణీ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహిస్తున్నారా, ఓటర్లు నింపిన ఫారాలను తిరిగి స్వీకరిస్తున్నారా అని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఫారాల పంపిణీ, స్వీకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. బీఎల్‌వోలు సేకరించిన ఫారాలను ఎప్పటికప్పుడు డిజిటలైజ్ చేయాలని, డిజిటలైజేషన్ ప్రక్రియను ఆపరేటర్లు అత్యంత అప్రమత్తంగా, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించాలని సూచించారు. డిజిటలైజేషన్‌లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. ఓటర్లకు ఫారాలు పూరించే విధానంపై అవగాహన కల్పిస్తూ అవసరమైన సహాయ సహకారాలు అందించాలని, ఇంటి వద్ద అందుబాటులో లేని ఓటర్లను ఫోన్ ద్వారా సంప్రదించి వివరాలు సేకరించి వారికి ఫారాలు అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. బీఎల్‌వోలు తమకు కేటాయించిన పరిధిలో అందుబాటులో లేని ఓటర్ల వివరాలను సంబంధిత బీఎల్‌వో సూపర్వైజర్లకు వెంటనే తెలియజేసి, ఫారాల పంపిణీ ప్రక్రియను నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ పుల్లయ్య మాట్లాడుతూ, కొత్తగూడెం పరిధిలో 66 పోలింగ్ కేంద్రాలు ఉండగా, వాటి పర్యవేక్షణకు ఏడుగురు బీఎల్‌వో సూపర్వైజర్లు విధులు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌కు వివరించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :