Wednesday, 16 September 2026 06:00:12 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

పాఠశాల అభివృద్ధికి ప్రధానోపాధ్యాయుని పాత్ర కీలకం – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 04 November 2025 06:11 PM Views : 516

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పాఠశాలల అభివృద్ధికి ప్రధానోపాధ్యాయుల పాత్ర మరియు వారి కృషి కీలకమని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు.మంగళవారం సుజాతనగర్ జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్శనలో భాగంగా ఆయన పాఠశాల నిర్వహణ, పరిశుభ్రత, విద్యార్థుల హాజరు, సౌకర్యాలు వంటి అంశాలను సమీక్షించారు. స్వచ్ఛత కాంపైన్ 5.0 కార్యక్రమం కింద పాఠశాలలో చేపట్టిన శుభ్రతా చర్యల గురించి ఉపాధ్యాయులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ రోజున పాఠశాలలో ఏ ఏ పనులు చేపట్టారు అని ఉపాధ్యాయులను అడిగి , ఈ రోజున చేయవలసిన పనులు సక్రమంగా జరగకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,ప్రభుత్వం చేపడుతున్న ప్రతి విద్యా కార్యక్రమాన్ని పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయుల సమన్వయంతో, విద్యార్థుల భాగస్వామ్యంతో, తల్లిదండ్రుల సహకారంతో అమలు చేసినప్పుడు మాత్రమే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.పాఠశాల అభివృద్ధి అనేది కేవలం భవన నిర్మాణం లేదా వసతుల పెంపు కాదు, అది ఒక సమగ్ర ప్రక్రియ. అందులో ప్రధానోపాధ్యాయుడు కీలక నాయకత్వ పాత్ర పోషించాలి. విద్యా ప్రమాణాలు, క్రమశిక్షణ, పరిశుభ్రత, విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం ఇవన్నీ ప్రధానోపాధ్యాయుని దిశానిర్దేశంపై ఆధారపడి ఉంటాయి, అని అన్నారు.పాఠశాలలోని టాయిలెట్లను పరిశీలించిన కలెక్టర్, కొన్ని టాయిలెట్లు మూసివేసి తాళం వేసి ఉంచినట్లు గమనించి అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రత కోసం అందుబాటులో ఉన్న వసతులను వినియోగించకపోవడం నిర్లక్ష్యమని పేర్కొని, వెంటనే టాయిలెట్లను తెరిచి మరమ్మతులు పూర్తి చేయాలని పాఠశాల మేనేజ్మెంట్ గ్రాంట్ ద్వారా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.త్రాగునీటి సౌకర్యం తగిన విధంగా లేని విషయం గమనించిన కలెక్టర్, పాఠశాలలో కొత్త బోర్ వేయడం కోసం తక్షణమే ప్రతిపాదనలు సమర్పించాలని విద్యాశాఖాధికారి మరియు మిషన్ భగీరథ ఈ ఈ కు ఆదేశించారు. విద్యార్థులకు నిరంతరంగా శుద్ధమైన త్రాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఇది పీఎం శ్రీ పాఠశాల కావడంతో, ఆటస్థల అభివృద్ధి నిధులను సక్రమంగా వినియోగించి, విద్యార్థుల క్రీడా ప్రతిభను పెంపొందించే దిశగా అన్ని ఆటలకు సంబంధించిన కోర్టులను ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడం ద్వారా శారీరక, మానసిక దృఢత్వం పెంపొందుతుందని, క్రమశిక్షణతో పాటు సమూహ భావన కూడా పెరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.పాఠశాల ప్రాంగణం బయట నిర్మాణంలో ఉన్న భవిత కేంద్రంను కూడా ఆయన పరిశీలించారు. భవనం చాలా లోతులో నిర్మించబడినందున వర్షపు నీరు నిలిచే ప్రమాదం ఉందని గమనించి, సరైన ఎత్తు పెంచి మిగతా నిర్మాణ పనులు కొనసాగించాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. భవిత కేంద్రాలు పాఠశాలలకు విలువైన వనరుల కేంద్రాలుగా మారాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని, కాబట్టి వాటి నిర్మాణం నాణ్యతతో కూడినదిగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.కలెక్టర్ ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో మాట్లాడి, విద్యార్థుల హాజరు, విద్యా ప్రమాణాలు, మరియు విద్యార్థుల ప్రతిభను పెంపొందించే పద్ధతులపై చర్చించారు. ప్రతి ఉపాధ్యాయుడు పాఠశాల స్థాయిలో మార్పు తీసుకురాగలడని, వారి కృషితోనే ప్రభుత్వ పాఠశాలలు మరింత ఆదర్శవంతమైనవిగా మారుతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ ప్లానింగ్ కోఆర్డినేటర్ ఎన్. సతీష్ కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :