తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం జిల్లా కోర్టు ఎదురుగా దివ్యాంగుల కోసం కృత్రిమ అవయవాల కేంద్రం (లింబ్ సెంటర్ ) ని స్థాపించి పేదలకు ఉచితంగా కృత్రిమ అవయవాలు పంపిణీ చేశారు. రోటరీ క్లబ్ పాస్ట్ గవర్నర్ గా ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రజలకు విశేషమైన సేవలు అందించారు. వందలాది ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించి, విద్యార్థులు కూర్చునేందుకు బల్లలు పంపిణీ చేశారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వేలాది మందికి ట్రై సైకిల్ పంపిణీ చేశారు. కిన్నెరసాని ప్రాజెక్ట్ మధ్యలో ఉండే తిప్పగుట్ట గిరిజన గ్రామ ప్రజలు మొసళ్ల దాడి నుంచి రక్షించేందుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో బోటు సౌకర్యం కల్పించారు. కొత్తగూడెం క్లబ్ లో జరిగే "జాతీయ బాలోత్సవ్" లో క్విజ్ పోటీలు నిర్వహించి విద్యార్థులకు సంధానకర్తక వ్యవహరించేవారు. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలను ఆదుకునేందుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లి మోకాలు చిప్ప ఆపరేషన్లను ఉచితంగా నిర్వహించేవారు. సింగరేణి ప్రధాన ఆస్పత్రిలో సుదీర్ఘ కాలం పాటు ఆర్థోపెడిక్ వైద్యులకు కార్మికులకు విశేషమైన సేవలు అందించిన డాక్టర్ విజేంద్రరావు కొత్తగూడెంలో విషాదం. ఆయన మృత దే హాన్ని దేహాన్ని సందర్శించి నివాళులర్పించిన కొత్తగూడెం పట్టణంలోని ప్రముఖులు, రాజకీయ నాయకులు, వైద్యులు, రోటరీ క్లబ్ సభ్యులు.
Admin
తెలుగు వెలుగు టీవీ