తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 76వ జన్మదిన సందర్భంగా బిజెపి మండల కమిటీ ఆధ్వర్యంలో జూలూరుపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలుకూరి రమేష్ పండ్లు పంపిణీ చేసినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా 13 సంవత్సరాలు మరియు ప్రధానమంత్రిగా 12 సంవత్సరాలు సుపరిపాలన నిజాయితీగా మరియు అభివృద్ధి, వికసత్ భారత్ లక్ష్యంగా పనిచేసినారు. పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టినారు. పేదలకు ప్రతి మనిషికి ఐదు కేజీలు ఉచితంగా బియ్యం, రైతులకు ఎరువుల సబ్సిడీ, అర్హత కలిగిన ప్రతి రైతుకు పీఎం కిసాన్ సన్మానిధి కింద సంవత్సరానికి 6000 రూపాయలు,ఉజ్జల ఉచిత గ్యాస్ లు, గ్రామాల్లో సిసి రోడ్లకు, గ్రామపంచాయతీ భవనాలు, కమ్యూనిటీ హాల్ స్మశానవాటికలు, గ్రామ పంచాయతీలకు 15 ఫైనాన్స్ కమిషన్ ద్వారా గ్రామ పంచాయతీలకు నేరుగా వారి అకౌంట్లో కేంద్ర ప్రభుత్వం డబ్బులు వేసినది. గ్రామాలకు ప్రధానమంత్రి సడక్ యోజన లింక్ రోడ్లు, ఉపాధి హామీ కూలీలకు పని కల్పించుతో పాటు రైతుల నీటి వనరులకు, మొక్కల పెంపకానికి నిధులు, స్వచ్ఛ భారత్ నిధులు, రైతు వేదిక భవనాలకు నిధులు, పేదలకు ఇన్సూరెన్స్ పథకాలు కేవలం సంవత్సరానికి 20 రూపాయలు కడితే రెండు లక్షల బీమా, బ్యాంక్ అకౌంట్ లేనివారికి జన్ ధన్ ( జీరో అకౌంట్ ) ఖాతాలు, పీఎం సూర్యగర్ ముక్తి బిజిలి పథకం ద్వారా 78 వేల రూపాయలు సబ్సిడీ, పేదలకు పక్కా గృహాలు, స్కూల్ బిల్డింగులు, అంగన్వాడీ భవనాలు,ముద్ర లోన్స్, నేషనల్ హైవేలు, రైల్వే లైన్లు రైల్వే స్టేషన్లు అభివృద్ధి, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకముందు రాష్ట్రాలకు పన్నుల్లో వాటా 32 శాతం మాత్రమే ఉండేది మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత రాష్ట్రాలకు 42% వాటా కల్పించినారు. అదే కాకుండా రాష్ట్రాలకు అభివృద్ధికి భారీగా నిధులు ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇచ్చినా కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా ఉపయోగించుకోలేక పోతున్నది. అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు చీకుడుతున్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కూడా బిజెపి ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలుకూరి రమేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు బిజెపి కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మాదినేని సతీష్, బిజెపి మండల అధ్యక్షులు భూక్య రమేష్, సిరిపురపు ప్రసాద్, మండల ప్రధాన కార్యదర్శి నిమ్మటూరి రామారావు, కార్యదర్శి ధారావత్ బాలకిషన్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు సిరిపురపు పుల్లారావు, కిష్టం శెట్టి గోపాల్ రావు, సిరిపురపు గోపాలరావు, నర్వనేని కృష్ణ, కిరణ్ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ మరియు వారి సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ