Friday, 18 September 2026 09:47:45 AM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

ఏజెన్సీలో దళితులకు సమాన హక్కులు కల్పించాలి

Date : 29 July 2026 03:30 PM Views : 90

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : - ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలి - ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు దళితుల అభివృద్ధికే ఖర్చు చేయాలి - దళితుల సమస్యల పరిష్కారం కోసం డీహెచ్‌పీఎస్ నిరంతర పోరాటాలు - ఆగస్టు 3 కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేద్దాం - డి హెచ్ పి ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సలిగంటి భద్రాద్రి కొత్తగూడెం: రాజ్యాంగం కల్పించిన సమాన హక్కులు దేశంలోని ప్రతి పౌరుడికి అందుబాటులో ఉండాలని, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న దళితులకు గిరిజనులతో సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా రంగాల్లో సమాన అవకాశాలు కల్పించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని డీహెచ్‌పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సలిగంటి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. డి హెచ్ పి ఎస్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం స్థానిక శేషగిరి భవన్ సిపిఐ కార్యాలయంలో సుంకిపాక ధర్మ అధ్యక్షతన మంగళవారం జరిగింది ఈ సందర్భంగా సలిగంటి మాట్లాడుతూ దళితుల హక్కుల పరిరక్షణ, అభివృద్ధి కోసం ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయాలని ఆయన కోరారు. ఏజెన్సీ ప్రాంతాల్లో దశాబ్దాల కాలంగా గిరిజనులతో పాటు నివసిస్తున్న దళితులు ఇప్పటికీ అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, భూమి, ఉపాధితో పాటు అనేక అంశాల్లో వెనుకబాటుతనం కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సమాన అభివృద్ధి ఫలాలను పొందేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో ప్రైవేట్ రంగంలో కూడా దళితులకు రిజర్వేషన్ విధానాన్ని అమలు చేయడం కాలానుగుణ అవసరమని ఇందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మతం పేరుతో ఎస్సీలను ఇబ్బందులకు గురిచేయడం, వివక్షకు పాల్పడడం రాజ్యాంగ విలువలకు విరుద్ధమని, కులానికి మతానికి అసలు సంబంధం లేదని మత విశ్వాసం వ్యక్తిగత హక్కు అని, దానిని ఆధారంగా చేసుకుని ఎస్సీ హోదా రద్దవుతుందని బెదిరింపులకు పాల్పడటం సరైనది కాదన్నారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు దళితుల సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేకంగా కేటాయించినవని, వాటిని ఇతర అవసరాలకు మళ్లించడం వల్ల దళితుల పురోగతికి తీవ్ర నష్టం కలుగుతోందని, ఎస్ సి సబ్ ప్లాన్ నిధులు దళితుల సమగ్రాభివృద్ధి కోసం వినియోగించాలని ప్రభుత్వాన్ని కోరారు.ఆర్థిక స్వావలంబన ద్వారానే దళిత సమాజం అభివృద్ధి సాధ్యమవుతుందని, దళితుల సమస్యల పరిష్కారం కోసం డీహెచ్‌పీఎస్ నిరంతరం ఉద్యమాలు, ఆందోళనలు నిర్వహిస్తూ ప్రభుత్వ దృష్టికి సమస్యలను తీసుకెళ్తోందని తెలిపారు. దళితుల హక్కుల సాధన, పెండింగ్ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఆగస్టు 3న నిర్వహించనున్న కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేయాలని సలిగంటి పిలుపునిచ్చారు. జిల్లాలోని దళితులు, యువత, మహిళలు, ప్రజాసంఘాల నాయకులు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉద్యమాన్ని జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దళితుల ఐక్యతతోనే హక్కుల సాధన సాధ్యమవుతుందని, సమానత్వ సమాజ నిర్మాణానికి అందరూ కలిసికట్టుగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డి హెచ్ పి ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి రత్రకుమారి జిల్లా అధ్యక్షులు దొంత మాల చెన్నయ్య నాయకులు మామిడాల ధనలక్ష్మి ఉరుసు రామకృష్ణ పాలమూరు శ్రీనివాస్ ఎర్రవెల్లి శంకర్ మండల రాజు ఇమ్మానియేల్ దార్ల లక్ష్మి చెరుకు సారయ్య తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :